Robin Hood : నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్ మంచి ప్రమోషన్లు చేసుకుంటోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటిస్తుండటంతో క్రేజ్ ఇంకా పెరిగింది. శ్రీలీల అందాలు మరింత ప్లస్ అయ్యాయి. మార్చి 28న వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. అది బాగానే ఆకట్టుకుంటోంది. అయితే మూవీ ప్రమోషన్లు మాత్రం టీమ్ అస్సలు ఆపట్లేదు. వరుసగా ఏదో ఒక కీలక విషయాన్ని మూవీ గురించి వెల్లడిస్తూనే ఉంది టీమ్. తాజాగా డైరెక్టర్ వెంకీ కుడుముల చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Read Also : Shalini Pandey : స్టైలిష్ డ్రెస్ లో షాలినీ పాండే.. ఆ ఫోజులు చూశారా..
ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాలో కీలక మలుపులు ఉంటాయన్నారు. సినిమా మొదలైన 20 నిముషాలకే కీలక మైన టర్నింగ్ ఉంటుందన్నారు. అది సినిమా కథను వేరే లెవల్ కు తీసుకెళ్తుందన్నారు. అన్నీ ఇప్పుడే చెబితే కిక్ ఉండదని చెప్పట్లేదన్నారు. నితిన్ కెరీర్ కు తన కెరీర్ కు ఈ సినిమా మంచి విజయం అందిస్తుందనే నమ్మకంతో ఉన్నామన్నారు ఆయన. ఇక నితిన్ సినిమాలో దేనికీ రానంత బజ్ ఈ మూవీకి క్రియేట్ అవుతోంది. ఇప్పటికే మంచి బిజినెస్ కూడా చేసింది. మరి ఈ మూవీ నితిన్ నమ్మకాన్ని నిలబెడుతుందా లేదా అనేది చూడాలి.