Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi: టాలీవుడ్లో హిట్టు మిషన్ గా పేరు తెచ్చుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన కొత్త సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి హిట్ కొట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. విక్టరీ వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్లో అనిల్ ఒక భారీ మల్టీస్టారర్ (#VenkyAnil5 / #NKRAR2) ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనిల్ రావిపూడి మార్క్ క్రేజీ అప్డేట్స్తో సందడి మొదలవగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి మైండ్ బ్లోయింగ్ అనౌన్స్మెంట్ వీడియో ఒకటి బయటకు వచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తాజాగా విడుదల చేసిన ప్రత్యేక ప్రమోషనల్ వీడియోలో కేవలం హీరోలే కాకుండా హీరోయిన్లు, మూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ కనిపించి సందడి చేశారు. ఇందులో డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతిలో కత్తి పట్టుకుని ఎంట్రీ ఇచ్చి.. నవ్వులు పూయించారు. సీరియస్ ఎలిమెంట్స్‌ను కూడా ఎంత హిలేరియస్‌గా మార్చవచ్చో అనిల్ ఈ వీడియోతో మరోసారి నిరూపించారు. ఈసారి అనిల్ తన నవ్వుల జాతరను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నారని ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు. అయితే ఇన్నాళ్లూ వెండితెరపై రాయలసీమ అనగానే కేవలం ‘ఫ్యాక్షన్, నరకాలు, బాంబులు’ అనే ముద్ర ఉండేది. కానీ, అనిల్ రావిపూడి ఈసారి ఆ ట్రెండ్‌ను మార్చేస్తూ సీమ నేపథ్యంలో ఒక అద్భుతమైన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ను ప్లాన్ చేసినట్లు ఈ ప్రమోషనల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో వెంకీ మామ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి సందడి చేయబోతున్నారు. ఈ భారీ చిత్రాన్ని జీ స్టూడియోస్, షైన్ స్క్రీన్స్ బ్యానర్లపై సాహు గారపాటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నవ్వుల జాతరను సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Spirit: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. 'స్పిరిట్' సరికొత్త అప్డేట్తో ఫ్యాన్స్‌కు పూనకాలే!
- Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్ - బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే..
- Bollywood : సినీ ఫక్కీలో లేడిప్రొడ్యూసర్ 'డైమండ్ ఇయర్ రింగ్స్' కొట్టేశారు
- ToxicTheMovie : వాయిదాల పర్వం ముగిసింది.. టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చింది
తాజావార్తలు
-
Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
-
Harmanpreet Kaur: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా రికార్డు.. హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘటన..
-
NEET Exam: “నాకు నీట్ కాదు, బురఖానే ముఖ్యం”.. పరీక్ష రాయనన్న ముస్లిం విద్యార్థిని.
-
Spirit: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. ‘స్పిరిట్’ సరికొత్త అప్డేట్తో ఫ్యాన్స్‌కు పూనకాలే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బోర్డుపై భారత్ స్కోర్ 900 పరుగులు..
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!