Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్ – బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారనే ఆరోపణలపై ఆయనకు బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్ – బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. దిలీప్ కుమార్ అనే వ్యక్తి ప్రకాష్ రాజ్‌పై బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్ చట్టవిరుద్ధంగా ఒకే పేరుతో నాలుగు వేర్వేరు ఓటర్ ఐడీ కార్డులను కలిగి ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన బెంగళూరులోని 48వ ACJM కోర్టు, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీవ్రంగా స్పందిస్తూ ఈ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశాయి.
కోర్టు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ నటుడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు నాన్-బైలబుల్ వారెంట్లు ఇచ్చినా స్పందించకపోవడంతో, తాజాగా కోర్టు మూడోసారి ఆయనపై కఠినమైన నాన్-బైలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఆయన సినిమాల విషయానికి వస్తే.. ఒకవైపు వివాదాలు నడుస్తున్నప్పటికీ ప్రకాష్ రాజ్ వరుస సినిమాలతో బిజీగానే ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ (Drishyam 3) లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఇటీవలే ఆయన తన షూటింగ్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నారట. మరిన్ని చిత్రాలతో కూడా ఆయన బిజీగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఆయన్ను చిక్కుల్లో పడేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!