Harmanpreet Kaur: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా రికార్డు.. హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. పురుషుల క్రికెట్లో సైతం ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును ఆమె తన పేరిట లిఖించబోతోంది. మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో టాస్ కోసం హర్మన్‌ప్రీత్ కౌర్ మైదానంలోకి అడుగుపెట్టగానే, అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన ప్రపంచంలోనే మొట్టమొదటి క్రికెటర్‌గా అవతరిస్తుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏ మహిళా లేదా పురుష క్రికెటర్ కూడా ఈ మైలురాయిని అందుకోలేదు.
2009లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన హర్మన్, ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడింది. అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మొదటి ఐదు స్థానాలూ మహిళా క్రికెటర్లవే కావడం విశేషం. హర్మన్ తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన సూజీ బేట్స్ (184 మ్యాచ్‌లు), డ్యానీ వ్యాట్ (183), ఎలిస్ పెర్రీ (177), స్మృతి మంధాన (173) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పురుషుల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ 163 మ్యాచ్‌లతో ఈ ఓవరాల్ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 159 మ్యాచ్‌లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20 కెరీర్ రికార్డులు కూడా అత్యంత అద్భుతంగా ఉన్నాయి. ఆమె ఆడిన 199 మ్యాచ్‌ల్లో 30.09 సగటుతో మొత్తం 4,123 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఆమె అత్యధిక వ్యక్తిగత స్కోరు 103 పరుగులు. బ్యాటింగ్‌లోనే కాకుండా అవసరమైనప్పుడు బౌలింగ్‌లోనూ రాణించిన హర్మన్, ఇప్పటివరకు 32 వికెట్లు పడగొట్టింది. బౌలింగ్‌లో ఆమె అత్యుత్తమ ప్రదర్శన 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం. ఇటు కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపిస్తూ, అటు ఆటగత్తెగా నిలకడైన ప్రదర్శన చేస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్, ఈ రోజు 200వ మ్యాచ్ ఆడి ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక ధృవతారగా నిలిచిపోనుంది. ఆమె సాధించిన ఈ ఘనత భారత క్రికెట్‌కు ఎనలేని గర్వకారణంగా మారింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..