Veera Simha Reddy: నందమూరి నట సింహం జూలు విప్పింది. ఏడాది నుంచి ఆల్కలీతో ఉన్న సింహ సంక్రాంతికి వేట మొదలుపెట్టింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ- శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ షురూ చేసేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక మరోపక్క సోషల్ మీడియాలో సైతం వరుస సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ హీట్ ఎక్కించేస్తున్నారు.కాగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
ఇక సెన్సార్ టాక్ ను బట్టి సినిమా పాజిటివ్ గానే సాగిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ థియేటర్ లో పూనకాలు తెప్పిస్తాయని అంటున్నారు. నందమూరి అభిమానులు ఒక్కరు కూడా సీట్లలో కూర్చోరని, బాలయ్య డైలాగ్స్ కు అరిచిఅరిచి గొంతులు పోతాయని అంటున్నారు. మొత్తానికి సెన్సార్ సభ్యులే సినిమా వీర లెవల్ అని చెప్పుకొచ్చారట. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే థమన్ సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అఖండ తరువాత అంతటి పవర్ ఫుల్ మ్యూజిక్ ను అందించాడు థమన్. మరి ఈ సినిమాతో ఈ కాంబో మరోసారి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.