Varun Tej Speech At BRO Pre Release Event: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వరుణ్ తేజ్ మాట్లాడుతూ హాయ్ బ్రోస్, ఇందాక బాబాయ్ రాకముందు నేను వైష్ణవ్ తేజ్ కూర్చుని ఏమి మాట్లాడాలో కూర్చుని డిసైడ్ అయ్యాము కానీ బాబాయ్ రాగానే మొత్తం మర్చిపోయాం. ముందుగా ఈ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన అతిధులకు, కళ్యాణ్ బాబాయ్ అభిమానులందరికీ థాంక్స్ అలాగే వెల్కమ్. ఫస్ట్ ఈ సినిమాల్లో తేజ్ కళ్యాణ్ బాబాయ్ తో చేస్తున్నాడు అని తెలిసిన వెంటనే ముందు కొంచెం జెలసి అనిపించింది. కానీ ఆ తర్వాత దానికి 100 రెట్లు ఆనందం కలిగింది. ఎందుకంటే తేజ్ కి కళ్యాణ్ బాబాయ్ అంటే స్పెషల్ గా ఇష్టం. ఆయనని ఒక గురువు లాగా భావిస్తాడు, కళ్యాణ్ బాబాయ్ తో ఇలా సినిమా చేసే అవకాశం దొరకడం తేజ్ కి దక్కిన అదృష్టం. తేజ్ ఈ సినిమా నీకు ఎంత స్పెషల్ అనేది నాకు తెలుసు. ఈ సినిమా అందరికన్నా నీకు ఇంపార్టెంట్.
Brahmanandam: పవన్ దైవాంశ సంభూతుడు.. ఆయన విజయాన్ని ఎవరు ఆపలేరు
నాకు తెలిసి ఈ సినిమా నీ కెరియర్ లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, ఐ లవ్ యు. నాకు ఇప్పటివరకు కళ్యాణ్ బాబాయ్ గురించి ఇలా స్టేజి మీద మాట్లాడే అవకాశం రాలేదు. మాట్లాడాలంటే వణుకొస్తోంది. కానీ బాబాయ్ గురించి కొన్ని మాటల్లో చెప్పడం కష్టం, చిన్నప్పటి నుంచి నువ్వు ఇలా చేయి, లేదా ఇలా చేయమని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. మీరు ఎదగాలనుకున్న రంగంలోనే కష్టపడి ఎదగండి అని మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మాకు హార్డ్ వర్క్ ఒకటే నేర్పించారు. అది బాబాయి అయినా మెగాస్టార్ చిరంజీవి గారైనా. బాబాయ్ రాజకీయంగా బయటికి వెళ్లి ఎండ, వానలో తిరుగుతున్నప్పుడు ఒక కొడుకుగా బాధ వేస్తుంది. ఇంత కష్టపడాలా అనిపిస్తూ ఉంటుంది కానీ మా కుటుంబం నుంచి దూరంగా ఉన్నా మీ కుటుంబాలకు దగ్గరవుతున్నారని ఆనందం మాకు ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆలోచన మాకు సంతృప్తికరం అనిపిస్తూ ఉంటుంది. బాబాయ్ వెనకాల మీరు ఎప్పుడు ఉంటారని మాకు తెలుసు అదే మా నమ్మకం, అదే మా ధైర్యం. మీరే కాదు మా కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరూ మా కళ్యాణ్ బాబాయ్ ఏం చేసినా అది సినిమాలైనా, రాజకీయాలైనా, సర్వీస్ అయినా అండగా ఉంటాం. ఫ్యామిలీ గా నేను అయినా వైష్ణవ్ తేజ్ అయినా తేజ్ అయినా, చరణన్న అయినా కళ్యాణ్ బాబాయ్ వెనకాలే ఉంటాం. ఇది ఏదో స్టేజ్ మీద చెప్పే మాట కాదు మనసు లోపల నుంచి చెప్పే మాట. బ్రో సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇది హిట్ అనే కాదు ఎందుకంటే బాబాయ్ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు చూశారు, ఇది కూడా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. అందులో నో డౌట్ మీరైనా దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు అని అంటూ ముగించారు.
ఇక వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా మీలాగా మీలో ఒకడిగా ఇక్కడికి వచ్చాను. ఒకటే చెప్పాలనుకుంటున్నాను కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంత అనుభవ నాకు లేదు. నా వయసు ఆయన అనుభవం అంత ఉంది. బ్రో టీమ్ అంతటికీ ఆల్ ది బెస్ట్. కచ్చితంగా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. నన్ను ఆహ్వానించిన వారందరికీ స్పెషల్ థాంక్స్ జైహింద్ అంటూ ముగించారు.