Varun Tej: భార్యపై దుష్ప్రచారం.. అందరి నోళ్లు మూయించిన వరుణ్ తేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej Pan India Movie Matka Regular Shoot From December: మెగా హీరో వరుణ్ తేజ్ కొద్దిరోజుల క్రితం తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జంట పెళ్లి చేసుకుని ఇంకా నెలరోజులు కూడా పూర్తికాకముందే వరుణ్ తేజ్ సినిమాల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మట్కా సినిమా నిలిచిపోయిందని, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బడ్జెట్ భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సినిమా నిలిపివేశారని ప్రచారం జరిగింది. ఇంకేముంది దానికి వారి వివాహానికి ముడిపెడుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్‌సైట్స్ లో వార్తలు వండి వడ్డించారు. తన భార్య గురించి ఇలా మాట్లాడటం, బాలేదని అనుకున్నారేమో తెలియదు గాని వరుణ్ తేజ్ వెంటనే ఈ సినిమా యూనిట్ తరఫున అధికారిక ప్రకటన అయితే ఇప్పించేశారు. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం ‘మట్కా’ రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. వైర ఎంటర్టైన్మెంట్స్పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది.
Animal: తెలుగులో కూడా యానిమల్ హవా.. ఎన్ని కోట్లకు అమ్మారో తెలుసా?
Also Read
ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌తో ఈ సినిమా టీమ్ బిజీగా ఉంది. 1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్లు రూపొందించారని యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారని, ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను వుంటాయని తెలుస్తోంది. నలుగురు ఫైట్ మాస్టర్లు యాక్షన్ ని పర్యవేక్షిస్తారని, 24 ఏళ్ల స్పాన్ కలిగిన కథలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారని అంటున్నారు. వరుణ్ తేజ్ కు హయ్యస్ట్ బడ్జెట్ ఎంటర్టైనర్గా ఉండే ఈ సినిమా కోసం వరుణ్ పూర్తి మేక్ఓవర్ అవుతున్నారని ఆయన సరసన నోరా ఫతేహి , మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు. ఈ చిత్రానికి సౌత్‌లో అత్యంత బిజీ గా ఉన్న కంపోజర్లలో ఒకరైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. ఇక ఈ ‘మట్కా’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..