Animal: తెలుగులో కూడా యానిమల్ హవా.. ఎన్ని కోట్లకు అమ్మారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Animal Movie Telugu states Pre Release Business Details: తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో డైరెక్ట్ చేసి రిలీజ్ చేసి హిట్టు కొట్టాడు. సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాను చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారిపోయాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ తెలుగు వాడు కావడం, రష్మిక మందన్నకి తెలుగులో మంచి మార్కెట్ ఉండడంతో తెలుగులో కూడా ఈ సినిమా హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ ఒకటో తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగు హక్కులను దిల్ రాజు దాదాపు 15 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఉత్తరాంధ్ర, నైజాం ప్రాంతాలలో దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాడు. ఈ రెండు ప్రాంతాల మినహాయించి మిగతా ప్రాంతాలలో దాదాపు 6 కోట్ల వరకు హక్కులను దిల్ రాజు అమ్మేసినట్టు తెలుస్తోంది.
Mansoor Ali Khan: త్రిషపై కామెంట్స్ కలకలం.. ఖుష్బూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో 9 కోట్లు కలెక్ట్ చేస్తే దిల్ రాజు సేఫ్ అయిపోతాడు. ఈ సినిమా మీద ఉన్న బజ్ కారణంగా తొమ్మిది కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద విషయమే కాదని అంటున్నారు. విశ్లేషకులు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. హైదరాబాదులో అయితే భారీగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నమోదు అవుతున్నాయి. సినిమా మీద ఉన్న బజ్ ప్రకారం మౌత్ టాక్ కూడా బాగుంటే నాలుగైదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 15 కోట్ల రూపాయలకు హక్కులు కొనుక్కున్నారు కాబట్టి 16 నుంచి 17 కోట్లు కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అయినట్టే చెప్పాలి. టి సిరీస్ సంస్థతో పాటు సందీప్ రెడ్డి వంగా సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ కూడా ఈ సినిమాను నిర్మించింది. బాలీవుడ్ లో అయితే ఈ సినిమాకు పోటీగా విక్కీ కౌశల్ నటించిన శ్యామ్ బహదూర్ కూడా రిలీజ్ అవుతుంది. తెలుగులో ఆ సినిమా ప్రభావం పెద్దగా చూపించదు. సుడిగాలి సుదీర్ నటించిన కాలింగ్ సహస్రలాంటి చిన్న సినిమాలు ఈ సినిమాతో పోటీపడే అవకాశాలు అయితే లేవు కాబట్టి హక్కుల కోసం వెచ్చించిన అమౌంట్ చాలా ఈజీగానే వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!