Varsha Dsouza and few Social Media influencers in The Family Star: రౌడీ బాయ్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన అందుకుంటున్న ఈ సినిమాలో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు కనిపించారు. అయితే సినిమా మొత్తం మీద వాళ్ళు లేరు కానీ ఒక్క సీన్లో మాత్రమే ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అలా వచ్చిన వారిలో వర్ష డిసౌజా కూడా ఉంది. యూట్యూబ్ లో సోషల్ మీడియాలో వీడియోలు చూసే వారందరికీ ఈ వర్ష గురించి పరిచయం ఉండే ఉంటుంది. యూట్యూబ్లో చాలా తక్కువ కాలంలోనే క్రేజ్ తెచ్చుకున్న ఆమెకు సోషల్ మీడియాలో కూడా ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువే.
Ashok Galla: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మహేష్ మేనల్లుడి సినిమా
స్టూడెంట్స్ రిలేటెడ్ వెబ్ సిరీస్ చేస్తూ క్లాస్మేట్స్, బ్యాక్ బెంచర్స్ లాంటి వెబ్ సిరీస్ తో అందరికీ బాగా దగ్గర అయింది. ఆ మధ్య ఆమె మార్ఫింగ్ వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ భామ విజయ్ దేవరకొండ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ భామతో పాటు ఆకాంక్ష అనే మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు కూడా ఆ సీన్ లో నటించే అవకాశం దక్కింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మరో లేడీ ఇన్ఫ్లుయెన్సర్ ఆష బొర్రా కూడా ఇదే సీన్లో కనిపించారు. ఇక హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన దివ్యాంశా కౌశిక్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించగా ఒక సీన్ లో కనిపించే పాత్రలో దక్షి గుత్తికొండ నటించింది. మొత్తం మీద విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు దర్శనమివ్వడం హాట్ టాపిక్ అవుతుంది.