Ashok Galla: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మహేష్ మేనల్లుడి సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Galla joins hands with Sithara Entertainments: మహేష్ బాబు మేనల్లుడు, హీరో సినిమాతో హీరోగా పరిచయమైన అశోక్ గల్లా తన తదుపరి సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో చేతులు కలిపారు. సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.27 గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఏప్రిల్ 5న అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈ తరం మెచ్చే అందమైన కథతో రాబోతుంది. ఈ సినిమా ప్రకటనకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ను బట్టి చూస్తే ఈ సినిమా కథ అమెరికాలో జరుగుతుందని అర్థమవుతోంది. “ది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ”తో కూడిన పోస్టర్ డిజైన్ ఆకట్టుకుంటోంది. “హ్యాపీ బర్త్‌డే అశోక్” అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసింది సినిమా యూనిట్. అలాగే ఇది నేటి తరం యువతకు సులభంగా చేరువయ్యే చిత్రంగా కనిపిస్తోందని అన్నారు.
Danam Nagender: 10 నిమిషాల్లో 45 వేల టికెట్లు ఎలా అమ్ముడు పోతాయి..?
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
‘ప్రేమమ్’, ‘భీష్మ’, ‘భీమ్లా నాయక్’, ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమాలను అందించే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అనతి కాలంలోనే తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. అలాంటి సితార సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో యువత మెచ్చే అంశాలతో పాటు కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా ఉంటుందని ఆశించవచ్చు. నిర్మాతలు ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు కానీ ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘లవర్’లో తన నటనతో విమర్శకుల మరియు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఉద్భవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!