Mohan Babu: కలక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి, ఆయన నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో మోహన్ బాబు విలన్ గా నటించి మెప్పించిన సినిమాలు ఎన్నో.. కరుడుగట్టిన విలనిజాన్ని పండించిన పాత్రలు ఎన్నో.. అలాంటి మోహన్ బాబును విలన్ గా పనికిరాడు అన్నాడట రామ్ గోపాల్ వర్మ. ఆయన దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన శివ ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ను ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కు మార్చిన సినిమాల్లో శివ ఒకటి. ఇక ఈ సినిమాలో రఘువరన్ వద్ద పనిచేసే ఒక రౌడీ.. నాగ్ కు వార్నింగ్ ఇస్తాడు. ముందు ఆ పాత్రకు మోహన్ బాబు ను అనుకున్నారట. ఇదే విషయాన్నీ అక్కినేని వెంకట్.. వర్మకు చెప్పాడట. మీరు చెప్తే మోహన్ బాబు వెంటనే ఒప్పుకుంటారని కూడా చెప్పారట. అయితే ఆ పాత్రకు మోహన్ బాబు పనికిరాడని వర్మ చెప్పాడట. అందుకు కారణం కూడా వర్మ ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Ariyana Glory: గుర్తుపట్టలేనంతగా మారిన అరియనా.. ఆ పని ఎక్కువ చేస్తున్నావా.. ?
“అప్పటికే మోహన్ బాబు తెలుగులో అందరికి తెలుసు. ఆయన డైలాగ్ డెలివరీ, నటన గురించి చెప్పనవసరం లేదు. అలాంటి వ్యక్తి నాగ్ కు వార్నింగ్ ఇస్తే.. అందరు మోహన్ బాబునే చూస్తారు. పాత్ర హైలెట్ అవ్వదు. ఇక్కడ మోహన్ బాబు కనిపించకూడదు.. కరుడుగట్టిన విలన్ మాత్రమే కనిపించాలి. అందుకే మోహన్ బాబు వద్దు.. ఆ పాత్రకు కొత్త నటుడును తీసుకుందాం అని చెప్పాను.. విశ్వనాథ్ అనే కుర్రాడి యాక్టింగ్ నచ్చి.. అతనిని తీసుకున్నాం.. అతను కూడాబాగా చేశాడు” అని వర్మ చెప్పుకొచ్చాడు. అలా మోహన్ బాబుకు శివ సినిమా మిస్ అయ్యింది. ఇంతలా ఒక పాత్ర గురించి ఆలోచించి.. సినిమా తీసిన వర్మనేనా ఇప్పుడు మనం చూస్తోంది. ఎలాంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ తీశాడు. ఇప్పుడు ఇలా మారిపోయాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.