Suriya: వ్వా.. అందుకే నువ్వంటే అభిమానులు పడి చచ్చిపోతున్నారయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న హీరో సూర్య మాత్రమే. ఇక్కడ సూర్యను కూడా తెలుగు నటుడు అనే అంటారు. అంతలా తెలుగు అభిమానులకు చేరువ అయ్యాడు. ఇక తమిళ్ లో సూర్య ఏ సినిమా రిలీజ్ అయినా అది తెలుగులో కూడా డబ్ కావాల్సిందే. అభిమానులు ఆయనను ఎంతగా ప్రేమిస్తారో.. అంతకు మించిన ప్రేమను సూర్య అభిమానులకు అందిస్తాడు. అభిమానులకు ఏది కావాలంటే అది అందించడంలో సూర్య ఎప్పుడు ముందు ఉంటాడు. ఇక నిన్న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి చెందిన విషయం తెల్సిందే. పల్నాడు జిల్లాకు చెందిన నక్కా వెంకటేష్, పోలూరు సాయి అనే ఇద్దరు అభిమానులు.. ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
Ariyana Glory: గుర్తుపట్టలేనంతగా మారిన అరియనా.. ఆ పని ఎక్కువ చేస్తున్నావా.. ?
Also Read
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
ఇక ఈ విషయం తెలియడంతో సూర్య కన్నీటిపర్యంతమయ్యాడు. మృతుల కుటుంబాలకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఇక సూర్యను చూసిన మృతుల తల్లిదండ్రులు.. గుండెలు పగిలేలా ఏడ్చారు. కొడుకులు లేరని, తమ జీవితం ఎలా అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక వారి బాధను చూసి చలించిపోయిన సూర్య వారిని ఓదార్చాడు. కొడుకులను తీసుకురాలేను కానీ, వారికి కొడుకుగా ఉంటాను అని చెప్పాడు. ఆ కుటుంబాలకు ఎలాంటి సహాయం కావాలన్నా తానే దగ్గర ఉండి చేస్తాను అని హామీ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన సూర్య అభిమానులు ఆయనను ప్రశంసిస్తున్నారు. అందుకే నువ్వంటే పడి చచ్చిపోతున్నారయ్యా.. నువ్వు చూపించే ప్రేమకు మేము ఎప్పుడు దాసోహం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?