దళపతి విజయ్ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్… ఇలా ఏ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చినా అది అప్పటివరకూ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డుని బ్రేక్ చేస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఒక ఆనవాయితీగా జరుగుతున్న ఈ విషయం మరోసారి రిపీట్ అవనుంది. విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’ ట్రైలర్ ఈరోజు సాయంత్రం అయిదు గంటలకి రిలీజ్ కాబోతుంది. తమిళ సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తుండడంతో ‘వారిసు’ ట్రైలర్ యుట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం గ్యారెంటీగా కనిపిస్తుంది. ఇప్పటికే వారిసు నుంచి ‘రంజితమే’ సాంగ్ రిలీజ్ అయ్యి 100 మిలియన్ వ్యూస్ రాబట్టి టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక వారిసు సినిమాకి పోటిగా ఒక్క రోజు ముందే రిలీజ్ కానున్న సినిమా ‘తునివు’. తల అజిత్ నటిస్తున్న ఈ మూవీపై కోలీవుడ్ లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తాం అంటూ మేకర్స్ ఇటివలే ‘తునివు’ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
24 గంటల్లో 22 మిలియన్ వ్యూస్, 1.5 మిలియన్ లైక్స్ సాదించిన తునివు ట్రైలర్ యుట్యూబ్ లో అంతముందు ఉన్న చాలా ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇప్పుడు తునివు ట్రైలర్ రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యడానికి వారిసు ట్రైలర్ వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ ని దృష్టిలో పెట్టుకోని, ఇప్పటివరకూ బయటకి వచ్చిన పాటల అనలటిక్స్ ని అబ్సర్వ్ చేసి చూస్తే ‘వారిసు’ ట్రైలర్ దాదాపు అవర్ లోనే 1 మిలియన్ లైక్స్ ని రాబట్టే ఛాన్స్ ఉందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇదే జరిగితే తునివు ట్రైలర్ రికార్డ్స్ ని, వారిసు ట్రైలర్ హ్యుజ్ మార్జిన్ తో బ్రేక్ చేసినట్లే అవుతుంది. జనవరి 11, 12 తారీఖుల్లో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడాల్సిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు, సోషల్ మీడియా పుణ్యామాని యుట్యూబ్ రికార్డ్స్ కోసం కూడా పోటీ పడుతున్నారు. రాను రాను హీరోల మధ్య ఇంకెలాంటి ఫైట్స్ చూడాల్సి వస్తుందో.
Countdown Starts Nanba.. 4 Hours To Go.. #VarisuTrailer Loading..#SunTV #ThalapathyVijay #Varisu @actorvijay @SVC_official @directorvamshi @MusicThaman @iamRashmika @7screenstudio #Varisu #VarisuPongal pic.twitter.com/bdx74IqRVs
— Sun TV (@SunTV) January 4, 2023