మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీని దర్శకుడు బాబీ డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరుని గుర్తు చేస్తున్న మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని జనవరి 13న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. ఆంధ్రాలో 12 నుంచి 18 వరకూ, తెలంగాణాలో 17 వరకూ సంక్రాంతి సెలవలు ఉండడంతో దాదాపు అయిదు రోజుల ఎక్స్టెండేడ్ వీకెండ్ లో చిరు బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తాడని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అయితే దిల్ రాజు ‘వారసుడు’ సినిమా కోసం ఎక్కువ శాతం థియేటర్స్ కి క్యాప్చర్ చెయ్యడంతో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలకి తక్కువ థియేటర్స్ దొరుకుతాయి అని అందరూ అనుకున్నారు. లాస్ట్ మినిట్ లో దిల్ రాజు ‘వారసుడు’ సినిమాని వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. దీంతో జనవరి 12న రిలీజ్ కానున్న ‘వీర సింహా రెడ్డి’కి బాగా కలిసొచ్చింది. ఇదే సమయంలో ‘వారసుడు’ సినిమా జనవరి 14న రిలీజ్ కానుండడం ‘వాల్తేరు వీరయ్య’కి కొత్త కష్టం తెచ్చినట్లు ఉంది.
జనవరి 12న బాలయ్య సినిమా దాదాపు అన్ని సెంటర్స్ లో రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత జనవరి 13న చిరుకి కూడా గ్రాండ్ రిలీజ్ దొరుకుతుంది, మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి. అయితే 14న వారసుడు సినిమా కోసం దిల్ రాజు మళ్లీ థియేటర్స్ హోల్డ్ చెయ్యడం స్టార్ట్ చేస్తాడు. దీంతో వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకి థియేటర్స్ తగ్గుతాయి. అయితే అప్పటికే వీర సింహా రెడ్డి రెండు రోజులు ఎక్కువ థియేటర్స్ లో ఉంటుంది కాబట్టి సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయి. వాల్తేరు వీరయ్య పరిస్థితి ఇలా లేదు, ఫస్ట్ డే భారి ఓపెనింగ్స్ ని రాబట్టగానే రెండో రోజు థియేటర్స్ తగ్గుతున్నాయి. దీంతో వాల్తేరు వీరయ్య సెకండ్ డే కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. చిరు సూపర్ హిట్ టాక్ సాదిస్తే అప్పుడు రెండో రోజు అంటే జనవరి 14న థియేటర్స్ కౌంట్ తగ్గినా లాంగ్ రన్ లో మంచి వసూళ్లు రాబడుతుంది. అలా కాకుండా చిరు యావరేజ్ టాక్ ని సాదించి, హిట్ టాక్ ని బాలయ్య రాబడితే ఆయన కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా వీర సింహా రెడ్డి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఏది జరిగినా మైత్రీ మూవీ మేకర్స్ కి మంచిదే కానీ ఒక్కరోజు గ్యాప్ లోనే వారసుడు వస్తుండడం వాల్తేరు వీరయ్య సినిమాకే మంచిది కాదు, దిల్ రాజు ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది.