Varalakshmi Sarathkumar: టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శబరి. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ “మా శబరి చిత్రీకరణ పూర్తయింది. మహేంద్ర గారి లాంటి నిర్మాత లభించడం మా అదృష్టం. సినిమా కోసం ఆయన చాలా ఖర్చు చేశారు. నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఆయన ఒకరు. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయిని దర్శకుడు అనిల్ తెరపైకి తీసుకొచ్చారు. మేము చాలా లొకేషన్లలో షూటింగ్ చేశాం. సినిమా బాగా వచ్చింది. శబరిలో ప్రధాన పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. రెండు మూడు రోజుల్లో డబ్బింగ్ చెప్పడం ప్రారంభిస్తా. త్వరలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం అని చెప్పుకొచ్చింది.
ఇక ఈ చిత్ర దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ.. కొత్త కథను తీసుకుని కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కించాం. ఈ చిత్రం ఒకరకంగా థ్రిల్లర్ జానర్ మూవీ అయినప్పటికీ.. సినిమాలో అన్ని భావోద్వేగాలు ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు సినిమాలో ఉన్నాయి. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతిగా, శబరి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ అద్భుతంగా నటించారు. యాక్షన్ సీన్స్ కూడా చక్కగా చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ సినిమా అని చెప్పారు. మరి ఈ సినిమాతో వరలక్ష్మీ ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.