నటుడిగా రజనీకాంత్ ది నలభై ఆరేళ్ల సుదీర్ఘ ప్రయాణం. చిత్రం ఏమంటే నటుడిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న రజనీకాంత్ కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం ఏదీ ఇంతవరకూ దక్కలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని 2000 సంవత్సరంలో పద్మ భూషణ్ పురస్కారంతోనూ, 2016లో పద్మ విభూషణ్ పురస్కారంతోనూ గౌరవించింది. ఇక తాజాగా 2021కి సంబంధించి సినిమా ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే’ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా…
భారతీయ చిత్రసీమలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. భారతీయ సినిమా రంగానికి ఎనలేని సేవలు చేసినవారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు ప్రకటించిన ప్రతీసారి విమర్శలు కూడా అదే తీరున వినిపిస్తూ ఉంటాయి. 2019 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అందించారు. అక్టోబర్ 25న జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రజనీకాంత్ ఈ అవార్డును…
“మహర్షి” సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు చిత్ర బృందానికి చాలా ప్రత్యేకమైన చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ఉపరాష్ట్రపతి ప్రశంసలు సైతం అందుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించిన ఈ చిత్రం టాలీవుడ్ లోని ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈరోజు ఉపరాష్ట్రపతి…
ఈరోజు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం జాతీయ చలనచిత్ర అవార్డులను అందజేశారు. ఐ అండ్ బి మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. నేచురల్ స్టార్ నాని స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ” ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాలలో రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. “జెర్సీ” దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఉప రాష్ట్రపతి…
ఈరోజు అక్టోబర్ 25న న్యూఢిల్లీలో జరిగిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. తన కుటుంబంతో కలిసి అవార్డుల వేడుకకు హాజరయ్యారు రజినీకాంత్. గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు రజనీకాంత్‌కి అవార్డును అందజేసి అభినందించారు. తెల్లటి కుర్తా, పైజామా ధరించిన రజనీకాంత్ చిరునవ్వుతో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. తాను అందుకున్న ఈ అవార్డును తన గురువు కె బాలచందర్ కు, రజినీకాంత్ అన్నయ్య సత్యనారాయణ…
నేడు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ సినిమా పురస్కారాల వేడుక జరగనుంది. ఈ 67 వ జాతీయ సినిమా పురస్కారాల వేడుకలో రజినీకాంత్ వంటి పలువురు ప్రముఖులు అవార్డులు అందుకోనున్నారు. వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఈ ఏడాది మార్చి లోనే ప్రకటించారు. అప్పట్లోనే అవార్డుల ప్రదానోత్సవం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై, అవార్డులను అందజేయనున్నారు. ఇందులో భాగంగానే సూపర్ స్టార్…