Urvashi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఇక గత కొన్నిరోజులుగా ఊర్వశి కి క్రికెటర్ రిషబ్ పంత్ కు సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. ఇక నాలుగేళ్ళ క్రితం చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ఇద్దరు బ్రేకప్ చేసుకొని ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారారు. ఇక సమయం దొరికినప్పుడల్లా రిషబ్ ను కడిగిపారేస్తూ ఉంటుంది. ఇటీవలే ఆర్ పీ అనే వ్యక్తి నాకోసం చాలాసేపు ఎదురుచూశాడు. నేను క్యార్ వ్యాన్ లో నిద్రపోయాను. అతడి ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయలేదు. అతడు నాకోసం ఎన్నో గంటలు ఎదురుచూసాడని చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలపై పంత్ తనదైన రీతిలో విరుచుకుపడ్డాడు. అక్కాయ్.. ఇవేమి వద్దు. నా పేరుతో నువ్వు ఫేమస్ అవ్వాలని చూడకు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి రిప్లై గా రిషబ్ ను పిల్ల బచ్చా అనేసి షాక్ ఇచ్చింది ఊర్వశి.
‘
అసలు మొదటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం లేదు. మ్యాచ్ లు చూడను అని తెలిపిన ఊర్వశి.. నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో ఒక్కసారిగా కనిపించి షాక్ ఇచ్చింది. అంతేకాకుండా ఫోర్లు, సిక్సులు కొట్టినప్పుడల్లా చప్పట్లు కొట్టి మరీ ఎంకరేజ్ చేసింది. అయితే ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. క్రికెట్ అంటే అసలు ఇష్టం లేదు అని చెప్పిన చిన్నది సడెన్ గా మనసు మార్చుకొని మ్యాచ్ చూడడానికి ఏకంగా స్టేడియంకే ఎందుకు వచ్చింది. నిన్న మ్యాచ్ లో రిషబ్ సరిగ్గా ఆడలేకపోవడానికి కారణం ఈమెనా ..? అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా వారు ట్రోల్ చేయడం ఆపడం లేదు. మాజీ ప్రియుడు ఓడిపోతే చూద్దామని వచ్చావా..? ఇండియా ఓడిపోతే చూడాలనుకున్నావా..? అని కొందరు.. ఇండియా గెలిచింది కాబట్టి సరిపోయింది.. లేకపోతె ఊర్వశి పని అయిపోయేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.