Unstoppable-2: ‘ఆహా’ ఓటీటీ వేదికగా బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో రెండో సీజన్‌కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికీ ఈ సెకండ్ సీజన్ ప్రోమో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఈ సీజన్ ట్రైలర్ ను 4వ తేదీ విజయవాడలో భారీ ఈవెంట్‌లో విడుదల చేయబోతున్నారు. దాదాపు 30 వేల మంది సమక్షంలో జరగబోయే వేడుక కోసం బాలకృష్ణ ప్రైవేట్ జెట్‌లో ఈనెల 4వ తేదీ ఉదయం విజయవాడ వెళుతున్నారు బాలయ్య. పాస్‌ల కోసం అభిమానుల తాకిడి తట్టుకోలేక పోతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. టోటల్ ఈవెంట్ ప్లాన్ కూడా పకడ్బందీగా డిజైన్ చేశారు. బాలయ్య పాటల హంగామాతో పాటు ఇండియన్ ఐడల్ సింగర్స్ పాటలు, బాలకృష్ణ పాటలతో మెడ్లీ, బాలకృష్ణ పాటల క్విజ్, సీజన్ వన్ హైలైట్స్, దసరా సందర్భంగా బాలకృష్ణ, అల్లు అరవింద్ చేతుల మీదుగా రావణ దహనం తదితర అంశాలు ఈ ఈవెంట్ లో చోటుచేసుకోనున్నాయి. ఈ సీజన్2 కి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనుండటం విశేషం.
Read Also: Krishna Vrinda Vihari: ఐఎమ్‌డీబీ టాప్-5లో ‘కృష్ణ వ్రింద విహారి’