సలార్ సినిమా చూసిన పాన్ ఇండియా ఆడియన్స్… ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథతో సినిమా చేసాడు. ప్రభాస్ డైనోసర్ లా ఉన్నాడు, ఆ ఫిజిక్ మాములుగా లేదు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ప్రభాస్ బెస్ట్ లుక్స్ లో సలార్ టాప్ ప్లేస్ లో ఉంటుందని అందరూ అంటుంటే కన్నడ సినీ అభిమానులు మాత్రం ప్రభాస్ సలార్ సినిమాకి సరిపోలేదు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ మాటలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నా డిసెంబర్ 22న సలార్ సినిమా రిలీజైన దగ్గర నుంచి ఈ నెగటివ్ కామెంట్స్ మరింత ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలో ఉగ్రమ్ సినిమా ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ మొదటి సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీ మురళి హీరోగా నటించాడు. ఇద్దరు స్నేహితుల కథగా 2014లో రిలీజ్ అయిన ఉగ్రమ్ సినిమా కన్నడలో అప్పటికి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
సలార్, ఉగ్రమ్ సినిమాకి రీమేక్ వర్షన్… స్కేల్ పెంచి అదే కథని పాన్ ఇండియా రేంజులో తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. సలార్ మేజర్ సీన్స్ అన్నీ ఉగ్రమ్ సినిమాలో చూసినట్లే ఉంటాయి. హీరో, స్కేల్ విషయంలో మాత్రమే మార్పులు తప్ప కోర్ ఎమోషన్ అండ్ సీన్ స్టేజింగ్ లో ఎలాంటి మార్పులు చేయలేదు ప్రశాంత్ నీల్. ఈ కారణంగానే కన్నడ మూవీ లవర్స్, ఉగ్రమ్ మూవీ లవర్స్, శ్రీ మురళి ఫ్యాన్స్ ఉగ్రమ్ ట్యాగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ… మా శ్రీ మురళి రేంజులో మీ ప్రభాస్ చేయలేదు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఉగ్రమ్ సినిమాలో శ్రీమురళి బాగా చేసాడు అనడంలో సందేహం లేదు కానీ ప్రభాస్ సలార్ సినిమాలో శ్రీమురళి రేంజులో యాక్టింగ్ చేయలేదు అనే మాటనే ప్రభాస్ అభిమానులని ఇబ్బంది పెడుతుంది. దీంతో ప్రభాస్ అండ్ కన్నడ మూవీ లవర్స్ మరియు శ్రీమురళి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వెర్బల్ వార్ జరుగుతోంది.