Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే అందరి చూపు ఉంది. నిత్యం పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలతో త్రివిక్రమ్ కాంపౌండ్ కలకలలాడేది. కానీ ఇప్పుడు వెలవెల బోతోంది. త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు హీరోలు దొరకని పరిస్థితి. హీరో అంటే ఇక్కడ స్టార్ హీరోలండి బాబు. ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా మన గురూజీనే. కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తానని పట్టుబడతాడు. అదే దెబ్బ కొట్టేసింది. ఎందుకంటే స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా బడ్జెట్ లో చేసేస్తున్నారు. పైగా రియలస్టిక్ సినిమాలకే జెండా ఊపుతున్నారు. క్లాస్ సినిమాలు తీసే త్రివిక్రమ్ కు ఇది అడ్డంకిగా మారింది.
Read Also : Kollywood : ఆమీర్ ఖాన్.. లోకేష్ కనకరాజ్.. ఓ సూపర్ హీరో
బన్నీతో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా.. అది ఇప్పట్లో ఉండేలా కనిపించలేదు. అట్లీ మూవీ అయ్యాకే ఉంటుంది. దానికి ఇంకో మూడేళ్లు పడుతుంది. అప్పటి దాకా ఖాళీగా ఉండటం కన్నా వెంకటేశ్ తో తీస్తే బెటర్ అంటున్నారు. కానీ దానికి త్రివిక్రమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావట్లేదు. త్రివిక్రమ్ తో చేయడానికి వెంకీ సిద్ధంగానే ఉన్నాడు. ప్రస్తుతం భారీ హిట్ తో ఖాళీగా ఉన్నాడు. కాబట్టి వెంకీతో మూవీ చేసి తానేంటూ త్రివిక్రమ్ నిరూపించుకుంటే బెటర్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్. వెంకీ నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు త్రివిక్రమ్ డైలాగులు రాశాడు. ఇద్దరి కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ పెద్ద హిట్. కాబట్టి మళ్లీ ఓ మూవీ చేస్తే బాగుంటుందని వీరి ఫ్యాన్స్ అంటున్నారు. మరి త్రివిక్రమ్ ఏం చేస్తాడో చూడాలి.