Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్టర్ అనే పేరు. డైరెక్టర్ గా ఎప్పుడూ బిజీగానే ఉండేవాడు. ఒక సినిమా అయిపోగానే మరో హీరోగా ఉండేవారు గురూజీ కోసం. గుంటూరు కారం సినిమాకు ముందు ఊడా ఇదే ఫాలో అయ్యాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా కన్ఫర్మ్ చేశాడు. ఇద్దరి కాంబోలో మూడు హ్యాట్రిక్ హిట్లు.. మంచి ఫ్రెండ్షిప్. ఇంకేంటి మూవీ పక్కా అనుకుంటే.. చివరకు అట్లీతో జోడీ కట్టాడు బన్నీ. ఇది ఒక రకంగా గురూజీని చిన్నబోయేలా చేసింది. స్టార్ హీరోలు అందరూ బిజీగానే ఉన్నారు. బన్నీ కోసం వెయిట్ చేసి మిగతా హీరోలను వదిలేయడంతో గురూజీకి ఎదురు దెబ్బ తగిలింది.
Read Also : Manchu Lakshmi : దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డా!
నామ మాత్రానికి బన్నీ, త్రివిక్రమ్ ఊవీ అంటూ ట్వీట్ వేసినా.. ఆ మూవీ లేదని తేలిపోయింది. దీంతో విక్టరీ వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్ లతో త్రివిక్రమ్ మూవీ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఒకేసారి ఇలా ఇద్దరు హీరోలను లాక్ చేయడం బహుషా ఎప్పుడూ చేయలేదు మన గురూజీ. మిగతా స్టార్ డైరెక్టర్లు కూడా ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలను ప్రకటించలేదు. త్రివిక్రమ్ ఇలా ఇద్దరినీ లాక్ చేయడానికి కారణం కూడా ఉంది.
ఒక హీరో మూవీ అయిపోగానే మరో హీరో కోసం వెతకాల్సిన పని ఉండదు. ఎందుకంటే మూవీ అయిపోయే టైమ్ కు స్టార్ హీరోలు వేరే డైరెక్టర్లకు డేట్స్ ఇచ్చేసి ఉంటున్నారు. కాబట్టి ఆ డేట్స్ ను తన ఖాతాలో వేసుకుంటే.. ఒక మూవీ అయిపోగానే ఇంకో మూవీని లైన్ లో ఉంటుందనే నమ్మకం ఉంటుంది. పైగా తీసిన మూవీ రిజల్ట్ తో టెన్షన్ పడకుండా తర్వాత మూవీ ఫిక్స్ అయి ఉంటుంది. ఇది ఒక రకంగా డైరెక్టర్లకు మంచిదే. మిగతా డైరెక్టర్లు కూడా ఇలా ఇద్దరు, ముగ్గురు హీరోలను లాక్ చేసేసుకుంటే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటున్నారు ట్రేడ్ పండితులు.
Read Also : Free Bus Effect: ఉచిత బస్సు ఆడవాళ్లకు.. డ్రైవర్లు, కండక్టర్లకు ఫ్రీగా దెబ్బలు!