తాజాగా జరిగిన హ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన వందలాది కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 265 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ సంఖ్య ఇప్పుడు 274 కు చేరింది . ఇక ఈ ప్రమాదం పై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ ప్రమాదం నుంచి మంచు లక్ష్మి తృటిలో తప్పించుకున్నట్లు తెలిసింది..
Also Read : Kalpika : సినీ నటి కల్పికపై మరో కేసు నమోదు
అయితే ఈ విమానం కూలిన రోజు మంచు లక్ష్మి కూడా లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లోనే ప్రయాణించారట. అదృష్టవశాత్తూ ఆమె ముంబై నుంచి వెళ్లే ఫ్లైట్ ఎక్కడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తన ఎక్స్ వేదికగా తెలిపారు.. ‘ అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన రోజు నేను, మా అమ్మాయి ముంబై నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ప్రయాణించాం. దేవుడి దయవల్ల మేము క్షేమంగా లండన్ చేరుకున్నాం. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్రమాదం గురించి తెలిసి షాక్‌కి గురయ్యాను. ఈ దుర్ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది నిజంగా బాధాకరం. ఈ ప్రమాదంలో విద్యార్థులు, వైద్యులు మృతి చెందారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదమే ఓ ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని మంచు లక్ష్మి తెలిపింది.