టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన చేయబోయే ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ‘గాడ్ ఆఫ్ వార్’ (God Of War) అనే టైటిల్‌తో ఆయన ఒక భారీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒక షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఒక ధర్మసంకటంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన రాసుకున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘గాడ్ ఆఫ్ వార్’ స్క్రిప్ట్ విషయంలో ఇప్పుడు రూటు మారుస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను పక్కన పెట్టి, ఇద్దరు అగ్ర హీరోలతో విడివిడిగా రెండు కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read :Pawan Kalyan : పవన్ ‘కటానా’ గర్జన: మార్షల్ ఆర్ట్స్ విధ్వంసం.. పోస్టర్ వెనుక రహస్యంమిదే!
త్రివిక్రమ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. ఇద్దరితోనూ మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లలో త్రివిక్రమ్ గతంలో ఇండస్ట్రీ హిట్లను అందుకున్నారు. ఇప్పుడు ‘గాడ్ ఆఫ్ వార్’ స్క్రిప్ట్‌ను ఏ ఒక్క హీరోతో చేసినా, మరొకరు ఫీలయ్యే అవకాశం ఉందని భావించిన త్రివిక్రమ్, ఈ స్క్రిప్ట్‌ను ప్రస్తుతానికి అటకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు టాక్. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఒక కొత్త కథ, ఎన్టీఆర్ ఇమేజ్‌కు సరిపోయేలా మరో భారీ ప్రాజెక్ట్ సిద్ధం సిద్ధం చేసే పనిలో ఉన్నారు త్రివిక్రమ్.
Also Read : Tamannaah : నిమిషానికి కోటి .. తమన్నా రేంజ్ మాములుగా లేదుగా!
అయితే గాడ్ ఆఫ్ వార్ ఆగిపోయి, దాని స్థానంలో కొత్త కథలతో త్రివిక్రమ్ వస్తే హీరోలు అంగీకరిస్తారా? అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న. అల్లు అర్జున్ ఇప్పటికే అట్లీ సినిమాతో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ కూడా ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తూ తన తదుపరి చిత్రాలను లైనప్‌లో ఉంచారు. ఒకవేళ త్రివిక్రమ్ ఈ ఇద్దరు హీరోలను ఒప్పించి, రెండు సినిమాలను లైన్‌లో పెడితే మాత్రం ఫాన్స్ గోల చల్లారే అవకాశం ఉంది. తనకు అత్యంత సన్నిహితమైన రెండు క్యాంపులను (మెగా/అల్లు మరియు నందమూరి) నొప్పించడం ఇష్టం లేకనే త్రివిక్రమ్ ఈ రిస్క్ తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ మదిలో ఉన్న ఈ కొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేక ‘గాడ్ ఆఫ్ వార్’ మళ్ళీ పట్టాలెక్కుతుందా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.