Trivikram Comments on Devara Jr NTR Goes Viral: సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు 100 కోట్లు కలెక్షన్ కలెక్ట్ చేయడంతో ఈరోజు శిల్పకళా వేదికలో ఒక భారీ సక్సెస్ మీట్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఈ వేడుకకి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఇదే వేడుకకు త్రివిక్రమ్ కూడా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం, ముందు సిద్దు 100 కోట్ల క్లబ్ లోకి వచ్చినందుకు వెల్కమ్. ఈ సినిమా టిల్లు స్క్వేర్ మాత్రమే కాదు రాధిక స్క్వేర్ కూడా. నాలుగు సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధుని చూస్తున్నాను.
Vikkatakavi: తొలి తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ ‘వికటకవి’ వచ్చేస్తున్నాడు!
దీని కోసం అతను పడిన కష్టం కానీ టిల్లు డైరెక్ట్ చేసిన విమల్ కానీ ఈ సినిమా డైరెక్ట్ చేసిన మల్లిక్ కానీ వాళ్లు మొత్తం టిల్లు తప్ప ఇంకా ఏమీ పని లేనట్టుగా పనిచేశారు. అందుకే ఇంత పెద్ద సక్సెస్ కనిపిస్తోంది. వంశీ కానీ, చినబాబు కానీ వాళ్లు సిద్ధూని ఆ టీంని నమ్మారు. అందుకే టిల్లు స్క్వేర్ టిల్లు కంటే స్క్వేర్ హా హిట్ అయింది. వచ్చే సంవత్సరం అంటే రేపటి నుంచి దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఇక అంతా నాకు తెలుసు, ఆయన మీద వెళ్ళిపోయేలా ఉంది. సో ఈ 100 పక్కన ఇంకో సున్నా పెట్టి ఆయన దేవర మొదలు పెట్టాలని మీ అందరి తరపున మనందరి తరపున ఎన్టీఆర్ ని కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ, ఈ టీం అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓవర్ టు దేవర అని అన్నారు.