Vikkatakavi: తొలి తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ ‘వికటకవి’ వచ్చేస్తున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ZEE5 తాజాగా అందించనున్న సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సిరీస్‌ను భారీ చిత్రాలను నిర్మిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే గ్రామాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. ఇలాంటి అమరగిరి గ్రామానికి డిటెక్టివ్ రామకృష్ణ వెళతాడు. అంతే కాకుండా ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలు, ఆధునిక కుట్రల వెనుకున్న రహస్యాలు అతను వెలికితీస్తాడు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో నీటి మట్టం పెరిగి కొన్ని సత్యాలు కనుమరుగైపోయాయి, దానికి సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియని రహస్యాలుగా మిగిలిపోతాయి. దాన్ని చేధించడానికి డిటెక్టివ్ రామకృష్ణ కాలానికి వ్యతిరేకంగా పోరాడుతాడు. ఈ ప్రయాణంలో తనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే. ఇప్పటి వరకు రూపొందనటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వికటకవి సిరీస్ రూపొందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, సిజ్జు అబ్దుల్ రషీద్, తారక్ పొన్నప్ప, రమ్యా రామకృష్ణన్, రఘు కుంచె, రషా కిర్మాణి, అమిత్ తివారి, రవితేజ నన్నిమల, గిరిధర్, సంతోష్ యాదవ్, సాయి ప్రసన్న, అశోక్ కుమార్.కె తదితరులు ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!