Trisha fires on Mansoor Ali Khan:ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గురించి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు త్రిష తనతో లియో సినిమాలో నటించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్‌పై విరుచుకుపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ తనకు ఈ సినిమాలో రేప్ సీన్ రాలేదని బాధపడ్డానని అన్నాడు. తన ఇటీవలి చిత్రాలలో తనకు రేప్ సన్నివేశాలు ఇవ్వడం లేదని ఆయన బాధపడ్డాడు. ‘‘త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా.. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్టుగానే ఆమెను కూడా బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లవచ్చని అనుకున్నా అని ఆయన చెప్పుకొచ్చాడు. చాలా సినిమాల్లో రేప్ సన్నివేశాలు చేశా, అవేమీ నాకు కొత్త కాదు కానీ ఈ కుర్రాళ్ళు కాశ్మీర్ షెడ్యూల్ సమయంలో సెట్స్‌లో కూడా త్రిషను నాకు చూపించలేదని ఆయన చెప్పుకొచ్చాడు.
Dil Raju:’మంగళవారం’ చూస్తున్నప్పుడు ‘అరుంధతి’ గుర్తొచ్చింది
త్రిష ఇప్పుడు నటుడిపై ఘాటుగా స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అసహ్యం కలిగించాయని చాలా బాధగా ఉందని పేర్కొంది. నటి తన సోషల్ మీడియాలో “మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా మరియు అసహ్యంగా మాట్లాడిన ఇటీవలి వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇది సెక్సిస్ట్, అగౌరవం, స్త్రీ ద్వేషం కనిపిస్తున్నాయి. అతను కోరుకుంటూనే ఉంటాడు, కానీ అతని లాంటి దారుణమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనందుకు నేను కృతజ్ఞురాలిని, నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా అతనితో నటించకుండా చూసుకుంటాను. అతనిలాంటి వ్యక్తులు మానవాళికి చెడ్డ పేరు తెస్తారని అంటూ ఆమె పేర్కొంది.