Tripti Dimri: అనిమల్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయింది త్రిప్తి దిమ్రి. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏకైక ముద్దుగుమ్మ త్రిప్తినే. నేషనల్ క్రష్ రష్మికను కూడా పక్కకు నెట్టి ఈ చిన్నది ఆ క్రెడిట్ మొత్తం తనవైపు తిప్పేసుకుంది. అనిమల్ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారింది త్రిప్తి. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్న త్రిప్తి.. అనిమల్ హిట్ అయ్యిన దగ్గరనుంచి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ఇక తాజాగా ఈ చిన్నది ఒక ఇంటర్వ్యూలో అనిమల్ తరువాత తన లైఫ్ ఎలా ఉందో చెప్పుకొచ్చింది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు తెలిపింది. తనను ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తారని అనుకోలేదని, ఇదంతా తనకు కొత్తగా ఉన్నా కూడా ఏంతో ఆనందాన్ని ఇస్తున్నట్లు తెలిపింది.
” అనిమల్ సినిమా రిలీజ్ తరువాత ప్రేక్షకులు, అభిమానుల నాకందిస్తున్న ప్రేమను నేను ఎంతో ఆస్వాదిస్తున్నా.. ఈ అనుభూతి నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. రిలీజ్ తరువాత నుంచి నా మొబైల్ ఫోన్ మెసేజ్‌లతో మోగుతూనే ఉంది. కాల్స్, మెసేజ్ లతో అస్సలు నా ఫోన్ ఖాళీ లేదు. చివరికి ఈ మెసేజ్‌ల వల్ల నేను నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. మెసేజ్ లు అన్ని వస్తున్నాయి. అవి చదువుతూ రాత్రి సమయాన్ని గడిపేస్తున్నాను.అయినా కూడా నాకు ఇది బాగా నచ్చింది. ఇక రణ్‌బీర్ కపూర్ అమేజింగ్ యాక్టర్. చాలా సపోర్టివ్. రష్మికా మందన్నా కూడా చాలా కో–ఆపరేటివ్” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.