జనవరి 30, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమవుతున్న త్రిముఖ చిత్రం, విడుదలకు ముందే తెలుగు చిత్ర పరిశ్రమలో చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేయబోతోందని సినిమా టీం ప్రకటించింది. ఈ చిత్రం ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని డెబ్యూ హీరోతో తెరకెక్కిన సినిమాలల్లో, తెలుగు సినీ చరిత్రలోనే అత్యధికగా 500 థియేటర్లలో విడుదల కానున్న సినిమాగా నిలవనుంది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2026 జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. సన్నీ లియోన్, యోగేష్ కాళ్లే మరియు అకృతి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను శ్రీదేవి మద్దాలి మరియు రమేష్ మద్దాలి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.