హీరోలన్న తర్వాత గాయపడడం కామనే. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తీస్తున్నప్పుడు అనుకోని ప్రమాదానికి గురవుతారు. ఎన్బీకే తల్వార్ షూటింగ్ లో యాక్షన్ సీన్ తీస్తున్న టైంలో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలు కండరాలు చిట్లిపోవడంతో మూడు గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఐదు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా, సంపూర్ణంగా కోలుకొని కెమెరా ముందుకు రావడానికి మినిమం రెండు నెలలు పడుతుందని తెలిసింది. ఈ లెక్కన ఎన్బీకే క్రిస్మస్‌కు రావడం కష్టమే. ఆపరేషన్ తర్వాత బాలయ్య వాకర్‌తో కనిపించిన ఫోటో నెట్‌లో వైరల్ అయింది.
పెద్ద షూటింగ్ టైంలో రామచరణ్ మణికట్టుకు గాయమైంది. రిలీజ్ మరోసారి వాయిదా పడకూడదు అన్న పట్టుదలతో నొప్పిని భరించి ఐటమ్ సాంగ్ చేశాడు రామచరణ్. “దిస్ ఈజ్ స్మాల్ గిఫ్ట్ దట్ బుచ్చి హ్యాస్ గివెన్ మీ, సో త్రూ ది కోర్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఐ థింక్ లాస్ట్ 25 30 డేస్ వర్ డూయింగ్ కుస్తీ పిల్వాన్ షూట్. అండ్ ఐ ఆస్క్ హిమ్ టూ గెట్ రీట్రైన్డ్ ఆర్టిస్ట్ బట్ హి గాట్ రియల్ పిల్వాన్స్. జబ్ యాక్షన్ బోల్తేనా జోర్దార్ పకడ్… అండ్ దట్స్ వాట్ హ్యాపెన్డ్. సో ఐ హావ్ ఏ కార్టిలేజ్ కటర్ బట్ ఇట్స్ ఫైన్, వర్త్ ఇట్. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మెమరీ.”
చేతికి కట్టుతోనే ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు రామచరణ్. పాన్ ఇండియా మూవీ కావడంతో నెల రోజుల పాటు నాన్‌స్టాప్ ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ కోసం నొప్పిని భరించాడు. రిలీజ్ అయిన వెంటనే సర్జరీ చేయించుకుందాం అనుకుంటే, దాదాపు రెండు నెలల గ్యాప్ తర్వాత సర్జరీ కోసం కోయంబత్తూర్‌లోని గంగా హాస్పిటల్‌లో చేరి చేయించుకున్నారు. అలానే ‘బరి’ సినిమా షూటింగ్ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ మోకాలికి తీవ్ర గాయమైంది. సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకున్న వరుణ్ రీసెంట్‌గా ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్ కోసం చేతి కర్రతో బయటకు వచ్చాడు. నేషనల్ అవార్డ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్ళు’ తీసిన యదువంశీ దర్శకత్వంలో ‘బరి’ రూపొందుతోంది.
చిరంజీవిని పాత గాయాలు వెంటాడడంతో సర్జరీ చేయించుకోక తప్పలేదు. ‘మనశంకర వరప్రసాద్’ రిలీజ్ తర్వాత భుజానికి కీ హోల్ సర్జరీ జరిగింది. చేతికి కట్టు ఉండడంతో ఫ్యాన్స్ కంగారుపడ్డారు. దీంతో సర్జరీ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు చిరంజీవి. మెగా హీరోలు ఒకరి తర్వాత ఒకరు సర్జరీ చేయించుకుంటున్నారు. భుజం నొప్పి పవన్ కళ్యాణ్‌ను చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. ఆ నొప్పితోనే సినిమాలు చేశారు. ఆ పెయిన్‌తోనే డిప్యూటీ సీఎంగా కార్యక్రమాలు నిర్వహించారు. జనాల్లోకి వెళ్లిన పవన్ నన్ను ఫ్యాన్స్ అటు ఇటు లాగేయడంతో భుజాల వద్ద కండరాలు చిట్లిపోవడంతో నొప్పి తీవ్రమైంది. ఇలా ఫ్యాన్స్ అత్యుత్సాహంతో పవన్ భుజాల నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. ఒకేసారి రెండు భుజాలకు సర్జరీ చేయడం కష్టం కాబట్టి, ముందుగా కుడి భుజానికి మూడున్నర గంటల పాటు సర్జరీ చేశారు. రెండు నెలల తర్వాత ఎడమ భుజానికి సర్జరీ చేయనున్నారు.
అందరూ యాక్షన్ సీన్స్‌లో గాయపడుతుంటే, జూనియర్ ఎన్టీఆర్ ఆ మధ్య యాడ్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యాడు. చిన్నపాటి గాయమే అని మేకర్స్ ప్రకటించినా, కోలుకోవడానికి మూడు నెలలు పట్టింది. ‘కాంతార చాప్టర్ వన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన తారక్ నొప్పితో బాధపడ్డాడు. “మామూలుగా ప్రతిసారి అరిచినట్టు మాట్లాడలేను. కొంచెం నొప్పியாக ఉంది. మీరు సైలెంట్ గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను. ఒక్కసారి అర్థం చేసుకోండి. థాంక్యూ, ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను, ఇంకాసేపు మాట్లాడేవాడిని” అని తెలిపాడు.
ఇక ప్రభాస్ అయితే మోకాలి గాయం తరుచుగా వెంటాడుతూనే ఉంది. చాలాసార్లు మోకాలి గాయంతో కుంటుకుంటూ నడిచాడు. ‘ఆదిపురుష్’ టైంలో మరొకరి సాయంతో మెట్లెక్కడం ఫ్యాన్స్‌ను కలవరపరిచింది. డార్లింగ్ మోకాలి ఆపరేషన్స్ అన్నీ యూరోప్‌లోనే జరిగాయి. గాయాన్ని అశ్రద్ధ చేస్తే ఆ నొప్పి వెంటాడుతూనే ఉంటుంది. రవితేజకు తగిలినటువంటి దెబ్బ విషయంలో ఇదే జరిగింది. ‘మాస్ జాతర’ యాక్షన్ సీన్ తీసే సమయంలో రవితేజ చేతికి గాయమైంది. ఇదంతా పట్టించుకోకుండా షూటింగ్ చేసుకుంటూ పోతున్న రవితేజ నొప్పి భరించలేకపోయాడు. కుడి చేతి కండరాలు చిట్లిపోవడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది.

