Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సక్సెస్ అనే పదం వినక ఏళ్లు గడిచిపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద వరుస ఫ్లాపులు వెంటాడుతున్నా, ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో మాత్రం ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గతంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాలో బన్నీ ఇచ్చిన హైప్‌తో ఆకాశానికి ఎదిగిన పూజా, ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రూపంలో బుట్టబొమ్మకు భారీ జాక్‌పాట్ తగిలినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘గుంటూరు కారం’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత టాలీవుడ్‌కు కాస్త దూరమైన పూజా హెగ్డే, ఇప్పుడు మళ్లీ తెలుగు తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా తనతో కలిసి నటించమని స్వయంగా ఆఫర్ ఇవ్వడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ – సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే పేరు దాదాపు ఖరారైనట్లు కోలీవుడ్ వర్గాల్లో బజ్ నడుస్తోంది. ‘అల వైకుంఠపురములో’ తర్వాత మరోసారి బన్నీతో జతకట్టడం ద్వారా పూజా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వబోతోందా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.
Also Read
తెలుగులో ఆఫర్లు తగ్గిన సమయంలో బాలీవుడ్, కోలీవుడ్‌లలో అదృష్టాన్ని పరీక్షించుకున్న పూజాకు అక్కడా నిరాశే ఎదురైంది. ‘బీస్ట్’ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో తమిళంలో ‘రెట్రో’, ‘జననాయకన్’ వంటి ఆఫర్లు దక్కించుకున్నా అవి బాక్సాఫీస్ వద్ద నిలవలేదు. ‘కూలీ’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టినా ఫలితం దక్కలేదు. అయినప్పటికీ ‘బీస్ట్’ క్రేజ్ ఆమెకు ఖండాంతరాల గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల శ్రీలంకలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన పూజాకు దళపతి విజయ్ ఫ్యాన్స్ ఘనస్వాగతం పలకగా, అక్కడ ‘అరబిక్ కుత్తు’ పాటకు స్టెప్పులేసి సిలోన్ ప్రజలను ఉర్రూతలూగించింది.
ప్రస్తుతం తెలుగులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సరసన ‘శ్రీశ్రీ’ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్డే, తమిళంలో ‘కాంచన 4’లో నటిస్తోంది. దీనికి తోడు కిచ్చా సుదీప్ ‘బిల్లా రంగా బాషా’ చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో మరికొన్నేళ్లు స్టార్ హీరోయిన్గా కొనసాగాలంటే పూజాకు ఇప్పుడు ఒక భారీ హిట్ అత్యవసరం. మరి బన్నీ – లోకేష్ సినిమా రూపంలో తగిలిన ఈ జాక్‌పాట్ బుట్టబొమ్మ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెస్తుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
-
CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
-
Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?