ప్రముఖ హీరో అడవిశేష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. ఈ ‘డెకాయిట్’ షూటింగ్ స్పాట్‌లో చిన్న ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో హీరో, హీరోయిన్ ఇద్దరూ ప్రమాదవశాత్తు క్రింద పడి గాయాలపాలయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం, గాయాలు కాస్త తీవ్రంగానే ఉన్నప్పటికీ, వారు ధైర్యంగా షూటింగ్‌ను పూర్తి చేశారని తెలుస్తోంది. ‘డెకాయిట్’ చిత్రం హై-ఓక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిస్తున్న ఒక భారీ ప్రాజెక్ట్. ఈ ప్రమాదం ఒక యాక్షన్ సీక్వెన్స్ సమయంలో జరిగినట్లు సమాచారం.…