Tollywood hero Creating Tension to Production House: ఒక టాలీవుడ్ కుర్ర హీరో గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద కుటుంబానికి చెందిన హీరో ఆ కుటుంబాన్ని నుంచి లాంచ్ అయ్యాడు అనే పేరు తప్ప సొంతంగా ఆయనకంటూ ఒక మంచి సినిమా అయితే ఇప్పటివరకు లేదు. చూడడానికి బాగుంటాడు హీరో లుక్స్ ఉన్నాయి కాబట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, పర్వాలేదు అనుకుంటూ సాగుతున్న కెరియర్లో ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఆ సినిమా చేస్తున్న నిర్మాణ సంస్థకు బ్రాండ్ బాబు లాగా మారి షాకుల మీద షాకులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఒక పెద్ద ప్రొడక్షన్ సంస్థ ఈ కుర్ర హీరోతో ఒక సినిమా చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే సినిమా షూటింగ్ విషయంలో అనేక తలనొప్పులు తీసుకొస్తున్నాడట ఈ కుర్ర హీరో. కేవలం కాస్ట్యూమ్స్ విషయంలో ఒక్కసారిగా నిర్మాణ సంస్థకి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సాధారణంగా కాస్ట్యూమ్ డిజైనర్లు హీరో హీరోయిన్లు కాస్ట్యూమ్స్ అలాగే సినిమాలో ఇతర ముఖ్యమైన నటీనటుల కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తూ ఉంటారు.
NTV Film Roundup : మైసూరులో చరణ్, ముంబైలో రామ్.. ఢిల్లీ వదలని దేవరకొండ
అయితే ఒక్కోసారి సెట్స్ మీదకు వెళ్లాక హీరో హీరోయిన్లకు ఆ బట్టలు నచ్చకపోతే లేదా కలర్ సెట్ అవ్వడం లేదు, అనుకుంటే కాస్ట్యూమ్స్ డిజైనర్ల సలహాతో అప్పటికప్పుడు కాస్ట్యూమ్స్ మారుస్తూ ఉంటారు. అలా మార్చడం వల్ల హీరోయిన్ కి దాదాపు 8 లక్షల వరకు ఎక్స్ట్రా ఖర్చు అయింది, అదే ఈ కుర్ర హీరో విషయానికొస్తే దాదాపు 40 లక్షలు ఈ కాస్ట్యూమ్స్ చేంజ్ చేయడం వల్లే అయిందని అంటున్నారు. తాను సాధారణ బట్టలు ధరించనని బ్రాండెడ్ దుస్తులు మాత్రమే ధరిస్తానని చెబుతున్న కుర్ర హీరో ఆ మేరకు 40 లక్షల వరకు ఎగస్ట్రా ఖర్చు చేయించాడని తెలుస్తోంది. కేవలం కాస్ట్యూమ్స్ విషయం మాత్రమే కాదని సినిమాకు సంబంధించిన అనేక ఇతర విషయాల్లో కూడా ఈ కుర్ర హీరో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని తెలుస్తోంది. దాదాపు చాలా విషయాలలో తన ఇమేజ్ వంకతో ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నాడని నిర్మాణ సంస్థ భావిస్తుందట. అది ఆ హీరో మార్కెట్కు మించి దాటిపోతూ ఉండడంతో సదరు నిర్మాణ సంస్థ ఇబ్బంది, పడుతూనే పెద్ద కుటుంబానికి చెందిన హీరో కాబట్టి ఖర్చు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. సినీ వర్గాల వారు హీరో ఇప్పటి నుంచే ఇలాంటి పోకడ లేకపోతే సినిమాలు చేయడం కష్టమేనని నిర్మాతలు ఒకసారి ఈ విషయం మీద కనుక దృష్టి పెడితే ఆయనకు భవిష్యత్తులో ఇబ్బంది తప్పదని అంటున్నారు. మరి ఈ విషయం అర్థం చేసుకుని ఖర్చు విషయంలో వెనక్కి తగ్గితే హీరోకి మంచి లైఫ్ ఉంటుందని సినీ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.