NTV Film Roundup: Telugu Movie Shooting Updates 25th November 2023: తెలుగు సినిమాల అప్డేట్స్ కోసం ఆయా సినిమా హీరోల అభిమానులు దర్శకుల అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ మా దృష్టికి వచ్చినవి మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Guntur Karam
గుంటూరు కారం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా ఇప్పుడు హైదరాబాదులో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతానికి రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది, షెడ్యూల్ కి సంబంధించిన చివరి రోజుల షూటింగ్ అని సినీవర్గాల సమాచారం.
Game Changer Shooting Update:
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు పెద్ద ఎత్తున డబ్బులు ఇన్వెస్ట్ చేసి నిర్మిస్తున్న ఇస్ గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి మైసూర్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అది ఇప్పటిలో పాసిబుల్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు, కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు, అని అంటున్నారు. మరొక హీరోయిన్గా అంజలి నటిస్తోంది.
Double ISMART Shooting Update:
డబుల్ ఇస్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ కొట్టిన తర్వాత లైగర్ అనే సినిమాతో మరో డిజాస్టర్ అందుకున్నాడు పూరీ జగన్నాథ్. రామ్ కూడా వరుసగా ది వారియర్, స్కంద అనే సినిమాలతో డిజాస్టర్లు అందుకోవడంతో ఈసారి పూరీతో కలిసి డబ్బులు ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బాంబేలో జరుగుతోంది, రామ్ పోతినేని కావ్య తాపర్ ఇద్దరి మీద కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.
Family Star Shooting Update:
ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ, హీరోగా పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో విజయ్ దేవరకొండ అలాగే సినిమాలోని ఇతరుల మీద సీన్స్ షూట్ చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది, ఆమె హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉండడంతో ప్రస్తుతానికి ఆమె లేకుండా ఉన్న సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇక ఆమె మీదనే ఒక వెడ్డింగ్ సాంగ్ కూడా షూట్ చేసేందుకు సినిమా యూనిట్ అయితే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అయితే అది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
NBK 109 Shooting Update:
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. నందమూరి బాలకృష్ణ 109 అని సంబోధిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ షూటింగ్ ఊటీలో మొదలైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ లో నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్నారా లేదా అనే విషయం మీద మాత్రం సినిమా యూనిట్ నుంచి గాని సినీ వర్గాల నుంచి కానీ క్లారిటీ లేదు.