టాలీవుడ్ ఫస్ట్ సూపర్ గర్ల్ మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న అడ్వెంచర్ మూవీ ‘ఇంద్రాణి’. తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాయింట్ ఎంచుకొని ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు తోడు కమర్షియల్ హంగులు జోడించి ఓ సూపర్ గర్ల్ స్టోరీగా ఇది తెరకెక్కబోతోందని వారు అన్నారు. ఈ మూవీ గురించి వారు మరింతగా తెలియచేస్తూ, ”ఓ కెప్టెన్ మార్వెల్, ఓ వండర్ విమెన్ లాంటి క్యారెక్టర్‌తో రంగంలోకి దిగబోతోంది మా ఇంద్రాణి. వినూత్న ప్రయోగంతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా ఇది రూపుదిద్దుకుంటుంది. లీడ్ రోల్ పోషిస్తున్న హీరోయిన్‌కి సూపర్ పవర్ ఉంటుంది. ఆమెతో పాటు కథ అంతా ట్రావెల్ చేసే మరో ఇద్దరు హీరోయిన్లకు ఈ సినిమాలో స్కోప్ ఉంది” అని దర్శకనిర్మాతలు చెప్పారు.
ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న స్టీఫెన్ న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ట్రైనింగ్ చేసి అక్కడే రెండున్నర సంవత్సరాల పాటు స్క్రిప్ట్‌పై కసరత్తులు చేసి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి? చాలా గ్రాండ్‌గా వి.ఎఫ్. ఎక్స్. వర్క్ ఎలా జరగాలి? అనేదానిపై ఓ అంచనాకు వచ్చారు. ఆ తర్వాత ఇండియాలో మరో మూడు నెలలు రీసెర్చ్ చేసి సూపర్ అవుట్‌పుట్‌ని ఆడియన్స్ ముందు ఉంచడమే లక్ష్యంగా ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, బ్యానర్ నేమ్ రిజిస్టర్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ చేశారు. షూటింగ్‌కి సంబంధించిన షెడ్యూల్స్‌పై ప్రణాళిక రచించి రెడీగా ఉన్నారు దర్శక నిర్మాతలు. భారీ కాస్టింగ్‌తో పాటు కొత్త నటీనటులను ఈ సినిమాతో ప్రోత్సహించబోతున్నారు. సాయి కార్తీక్ అందించబోతున్న మ్యూజిక్ సినిమాలో హైలైట్ కానుందని నిర్మాత చెప్పారు.
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!