స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న అడ్వెంచర్ మూవీ ‘ఇంద్రాణి’. తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాయింట్ ఎంచుకొని ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు తోడు కమర్షియల్ హంగులు జోడించి ఓ సూపర్ గర్ల్ స్టోరీగా ఇది తెరకెక్కబోతోందని వారు అన్నారు. ఈ మూవీ గురించి వారు మరింతగా తెలియచేస్తూ, ”ఓ కెప్టెన్ మార్వెల్, ఓ వండర్ విమెన్ లాంటి క్యారెక్టర్‌తో రంగంలోకి…