90స్, 2000స్‌లో బాక్సాఫీస్‌ను రూల్ చేసిన దర్శకులైన కృష్ణా రెడ్డి, వైవీఎస్ చౌదరి, వినాయక్, శ్రీను వైట్లలాంటి సీనియర్ మోస్ట్ దర్శకులకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. టాలీవుడ్‌లో యంగ్ తరంగ్ నయా కాన్సెప్ట్ చిత్రాలతో హిట్స్ అందుకుంటుంటే.. అవుడేటెట్ స్టోరీలతో ఫెయిల్యూర్స్ చవిచూడటం కూడా ఈ సీనియర్లకు మైనస్‌గా మారింది. కానీ సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని ఈ ఫిల్మ్ మేకర్స్ కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. గ్యాప్ ఇచ్చినా సరే.. బౌన్స్ బ్యాక్ అవుతామన్న కాన్షిడెంట్‌తో నయా ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేస్తున్నారు.
Also Read : Kishkindhapuri : కిష్కింధపురి.. ఆడియెన్స్ కు నచ్చకుంటే ఇండస్ట్రీ వదిలి వెళ్తా : బెల్లం కొండ
ఎస్వీ కృష్ణా రెడ్డి : ఫ్యామిలీ డైరెక్టర్‌గా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న మల్టీ టాలెంటర్ దాదాపు పుష్కర కాలం గ్యాప్ తీసుకుని తన 43వ సినిమాను పట్టాలెక్కించారు. సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు. రీసెంట్లీ లాంచైన ఈ మూవీతో ఫ్యామిలీ డైరెక్టర్ ఈజ్ బ్యాక్ అనిపించుకోవాలని ట్రై చేస్తున్నారు.
వైవీఎస్ చౌదరి : టాలీవుడ్ ఒకప్పటి ఫైరింగ్ డైరెక్టర్ దేవదాసు తర్వాత హిట్టే చూడలేదు. సాయి తేజ్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసి అటు దర్శకుడిగా ఇటు నిర్మాతగానూ చితికిపోయాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న వైవీఎస్ చౌదరి.. ఇప్పుడు హరికృష్ణ మనవడు తారక్ రామారావును హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను టేకప్ చేశాడు. నందమూరి వారసుడికి హిట్టిచ్చి తాను బౌన్స్ బ్యాక్ కావాలని ప్రయత్నిస్తున్నాడు.
వి వినాయక్ : ఒకప్పుడు ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఖైదీ నంబర్ 150 తర్వాత ఇంటిలిజెంట్ చేస్తే డిజాస్టర్ దీంతో ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. టాలీవుడ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి బెల్లంకొండతో చత్రపతిని హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇక లాంగ్ గ్యాప్ ఇచ్చి విక్టరీ వెంకటేశ్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడని టాక్. గతంలో ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన లక్ష్మీ బ్లాక్ బస్టర్ హిట్.
Also Read : Exclusive : బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ ప్రీమియర్ టాక్..
శ్రీను వైట్ల : హీరోలతో పైటింగ్సే, రొమాన్సే కాదూ కామెడీ పండించే శ్రీను వైట్ల కూడా హిట్ చూసి చాలా కాలమే అవుతోంది. వరుస ఫెయిల్యూర్స్‌తో హీరోలు మొహం చాటేస్తున్న వేళ డిజాస్టర్లతో సతమతమౌతున్న నితిన్ ఆఫర్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇద్దరినీ కలుపుతోంది.
ఏదైమేనా అలుపెరుగని విక్రమార్కుల్లా పోరాడుతున్న ఈ ఫిల్మ్ మేకర్లు.. బౌన్స్ బ్యాకై.. మరింత మంది ఫేడవుట్ దర్శకులకు బూస్టర్లుగా మారతారేమో లెట్స్ వెయిట్.