కాస్ట్లీ చిత్రాల హీరోగా పేరున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరెకెక్కిన చిత్రం కిష్కింధపురి. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లం కొండ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
Also Read : Malayala Beauty : టాలీవుడ్‌లోకి మరో కేరళ కుట్టి.. బ్రేక్ ఇచ్చేందుకు రెడీ అయిన స్టార్ హీరో కొడుకు
కాగా ఈ సినిమా నిన్న రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ ముల్టీప్లెక్స్ లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ షో చిత్ర హీరో బెల్లంకొండ మరియు అతడి ఫ్రెండ్స్ తో పాటు మరికొందరు అతి ముఖ్యమైన వాళ్ళు మాత్రమే హాజరయ్యారు. సినిమా చూసిన వారి నుండి వచ్చిన టాక్ ఎలా ఉందంటే.. 2 గంటల 5 నిమిషాల సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ను చక్కగా ప్లేస్ చేసాడట దర్శకుడు. ఎటువంటి అదనపు హంగులకు వెళ్లకుండా అనుకున్న పాయింట్ ను తెరపై అంతే చక్కగా ప్రెసెంట్ చేసాడట. సెకెండ్ హాఫ్ లో దెయ్యంగా అనుపమ పరమేశ్వరన్ నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తుందట. థ్రిల్లర్ ఎపిసోడ్స్ స్టోరీ నేరేషన్ చాలా బాగుందని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌండ్. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండింగ్ భయపెట్టింది. డాల్బీ అట్మాస్ లో సౌండింగ్ చాలా బాగుందని సమాచారం. ఇక బెల్లంకొండా ఫస్ట్ టైమ్ ఇలాంటి జానర్ లో కూడా అద్భుతంగా ఉందట. అయితే అక్కడకక్కడ కాస్త సౌండింగ్ లౌడ్ గా ఉందని. కానీ కొన్నీ అక్కర్లేని సన్నివేశాలతో పాటు ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుందని తెలిసింది. ఓవరాల్ రాక్షసుడు జోడి మరోసారి హిట్ కొట్టినట్టే అని వినిపిస్తోంది.