Starboy Siddu continues to shatter records all over: 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్’ మార్చి 29 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా భారీ అంచనాలతో ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ అయిన మొదటి షో నుంచే సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ తెచ్చుకుంది..రెండు గంటలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు. ఇక ఈ సినిమా సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.
Also Read; JaiHanuman: “జై హనుమాన్” మోషన్ పోస్టర్ షేర్ చేసిన ప్రశాంత్ వర్మ…!
ఇక ఈ మూవీ విడుదల అయినా మొదటి రోజు నుండి అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 23.7 కోట్ల వసూళ్లు రాబట్టింది రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇక నిన్న శనివారం వీకెండ్ కావడంతో రెండో రోజు కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. రెండు రోజుల్లో ఓవర్సీస్ లో మొత్తం 45.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టిల్లు క్రేజీ పోస్టర్ షేర్ చేశారు. అలాగే రెండు రాష్ట్రాల్లో రూ. 6 కోట్లు షేర్ వసూలు చేసినట్లు తెలిసింది. అలాగే వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాస్ కలిపి రూ. 7.50 కోట్లు వరకూ షేర్ కలెక్షన్స్ వచ్చాయని.. రెండు రోజులు కలిపి రూ. 21 కోట్లు వచ్చిందని తెలుస్తోంది. ఉత్తర అమెరికాలోని టిల్లు స్క్వేర్ ఇప్పటివరకు $1.48 మిలియన్లు వసూలు చేసి $2M మార్క్ దిశగా దూసుకుపోతోంది. రెండు రోజుల ఓవర్సీస్ గ్రాస్ దాదాపు ₹14.5 కోట్లు. ఇప్పటి వరకు సంచలనం అనే చెప్పాలి, పోను పోను ఇంకా ఎన్ని రికార్డులు తన కతాలో వేసుకుంటుందో చూడాలి.
Tillanna Box-office RAMPAGE Continues, grosses over 𝟒𝟓.𝟑 𝐂𝐑 in 𝟐 𝐃𝐚𝐲𝐬 🔥🔥
Starboy 🌟continues to shatter records all over! 💥💥#TilluSquare #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo @kalyanshankar23 @NavinNooli #SaiPrakash… pic.twitter.com/sDuOBCdVLO
— Telugu FilmNagar (@telugufilmnagar) March 31, 2024