JaiHanuman: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా వచ్చిన హనుమాన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మూవీ మలయాళం భాషల్లో రిలీజైంది. అయితే ఈ మూవీ ఊహించిన దాని కంటే ఎక్కువగానే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లతో దుమ్ము రేపింది.మహేష్ బాబు సినిమా తో పోటీగా రిలీజ్ చేసిన ఈ మూవీ కి ప్రేక్షకులు దగ్గర నుంచి అపరమైనా స్పందన లభించింది. ఇది ఈ లా ఉంటె హనుమాన్ మూవీకి కొనసాగింపుగా జై హనుమాన్ మూవీ ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలియజేసిన విషయం తెలిసిందే..ఇక ఇటీవల అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read; Sreeleela : ప్రముఖ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా శ్రీలీలా..!
ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీ కి సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేసారు. వెల్కమ్ అంజనాద్రి 2.0 అంటూ క్యాప్షన్లతో చిన్న క్లిప్‌ను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో ట్రేండింగ్ లో ఉంది. అలాగే సినిమాలో ఒక స్టార్ హీరో రాముడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఎవరో అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలిసిందే. ప్రస్తుతం ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యం అవడం తో అనుపమ పరమేశ్వరన్ తో ‘ఆక్టోపస్’ అనే మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక జై హనుమాన్ మూవీ మరింత విజువల్ వండర్ గా ఉండేట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు..జై హనుమాన్ మూవీ 2025 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
#JaiHanuMan: Director Prashant Varma shared a small clip of Anjanadri 2.0 pic.twitter.com/RS2K0gWhBg
— Movies4u (@Movies4uOfficl) March 31, 2024