బాలీవుడ్ కి అసలు సెట్ అవ్వని సీజన్, బాలీవుడ్ పూర్తిగా వదిలేసిన సీజన్ ‘దివాలీ’ ఫెస్టివల్. ఆ రోజు ఉదయం నుంచి లక్ష్మీ పూజ ఉంటుంది, సాయంత్రం టపాసులు పేల్చే పనిలో ఉంటారు. ఈ కారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతూ ఉంటుంది. అందుకే బాలీవుడ్ వర్గాలు దాదాపు దివాలీ పండగ రోజున తమ సినిమాలని రిలీజ్ చేయవు. అలాంటి డ్రై సీజన్ ని కాష్ చేసుకుంటూ, తన ఆడియన్స్ పుల్లింగ్ కెపాసిటీలో ప్రూవ్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. టైగర్ 3 సినిమాతో దీపావళి రోజున వరల్డ్ వైడ్ 94 కోట్ల గ్రాస్ ని రాబట్టాడు సల్మాన్ ఖాన్. దీపావళి రోజున ఇది బాలీవుడ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ గ్రాసింగ్. డే 1 94 కోట్లు రాబట్టిన సల్మాన్… మొదటి రోజు సెకండ్ షో నుంచి సాలిడ్ బుకింగ్స్ ని రాబట్టడం స్టార్ట్ చేసాడు.
నార్త్ లో కొన్ని సెంటర్స్ లో మిడ్ నైట్ 11కి కూడా టైగర్ 3 షోస్ పడ్డాయి. దీంతో టపాసులు కాల్చిన తర్వాత సల్మాన్ ఫ్యాన్స్ థియేటర్స్ కి వెళ్లిపోయారు. సెకండ్ డే కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. అన్ని సెంటర్స్ లో టైగర్ 3 సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. షారుఖ్ ఫ్యాన్స్ అండ్ హ్రితిక్ రోషన్ ఫ్యాన్స్ కూడా థియేటర్స్ కి వెళ్తుండడంతో ఓవర్సీస్ నుంచి నార్త్ వరకూ ఆల్ సెంటర్స్ లో హౌజ్ ఫుల్స్ పడుతున్నాయి. ఎర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం టైగర్ 3 సినిమా 60 కోట్ల నెట్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఓవరాల్ గా రెండు రోజులు కలిపి టైగర్ 3 సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ రోజు బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మరో రెండు రోజులు బుకింగ్స్ ని హోల్డ్ చేయగలిగితే చాలు టైగర్ 3 సినిమాకి సాలిడ్ వీకెండ్ పడుతుంది. ఇప్పుడున్న బుకింగ్స్ ట్రెండ్ ప్రకారం టైగర్ 3 సినిమా ఓవరాల్ థియేట్రికల్ రన్ లో 600-800 కోట్ల మధ్యలో ఆగిపోయేలా కనిపిస్తోంది.