అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మీనాక్షి చౌదరి. హీరో సుశాంత్ సరసన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది ఈ బ్యూటీ. తాజాగా విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో నటించింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ నటిలో చాలా ట్యాలెంట్ దాగి ఉంది.
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దుండగుడి గుర్తింపు.. ఎలా ఇంట్లోకి వచ్చాడంటే..?
మీనాక్షి 2018 లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 టైటిల్‌ను గెలుచుకుంది. అదే సంవత్సరం మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి తన లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అడగా ‘ప్రతి ఒక్కరు జీవితంలో ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి హార్డ్ వర్క్, రెండు డిసిప్లెన్. మనం ఒకటి కావాలి అనుకున్నప్పుడు కష్ట పడాలి. అలాగే ఎదుటి వారితో మన పద్ధతి ఎలా ఉందో చూసుకోవాలి. అది ఎలాంటి ఫీల్డ్ లో ఉన్న సరే. నాకు చిన్నప్పటి నుంచి మూడు కోరికలు ఉండెవి. ఒకటి డాక్టర్, రెండు మిస్ ఇండియా, మూడు సివిల్ సర్వెంట్. ఇందులో మొదటి రెండు సాధించాను ’ అంటూ చెప్పుకొచ్చింది.