సాధారణంగా తమ సినిమాలకు సీక్వెల్స్ తీస్తుంటారు హీరోలు. కానీ కార్తీ మాత్రం పక్క హీరోల చిత్రాల సీక్వెల్స్‌ను తన భుజాన వేసుకుంటున్నాడు. సడెన్లీ కథలోకి ఎంటరై నెక్ట్స్ స్టోరీకి లీడ్ అవుతున్నాడు. అన్న కంగువాలో, నాని హిట్3లో కీ రోల్స్ చేసి వీటి సీక్వెల్స్‌ను నడిపించే రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. కంగువా2, హిట్ 4కి లీడ్ యాక్టర్ అయిపోయాడు కార్తీ. ఇవే కాదు ఆయన లైనప్ లో సీక్వెల్సే ఎక్కువగా ఉండటం గమనార్హం
Also Read : NANI : బ్రేక్ ఈవెన్ కు అడుగు దూరంలో ఆగిన హిట్ – 3
కోలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా మారిన కార్తీ చేతిలో ప్రజెంట్ అరడజనుకు పైగా ప్రాజెక్టులున్నాయి. గత ఏడాది సత్యం సుందరంతో డీసెంట్ హిట్ అందుకున్న కార్తీ నెక్ట్స్ వా వాతియార్‌తో ముందుకు రాబోతున్నాడు. ఇది సెట్స్‌పై ఉండగానే సర్దార్ సీక్వెల్ కంప్లీట్ చేశాడు. సర్దార్ 2 కుదిరితే ఈ ఏడాది దీపావళికి లేదంటే పొంగల్ రేసులో దింపనున్నారు మేకర్స్. సర్దార్ కన్నా మరింత క్రియేటివ్‌గా, ఇంటర్నేషనల్ లెవల్లో సర్దార్ 2ను తెరకెక్కిస్తున్నాడు పీఎస్ మిత్రన్. ఖైదీ2 ఉండబోతుందని రీసెంట్లీ ఎనౌన్స్ చేశాడు లోకేశ్ కనగరాజ్. ఇవే కాకుండా హెచ్ వినోద్ దర్శకత్వంలో 2017లో వచ్చిన ఖాకీకి సీక్వెల్ కూడా ఉండబోతుంది. యుగానికి ఒక్కడు పార్ట్ 2లో ధనుష్ లీడ్ యాక్టర్‌గా మారితే కార్తీ లేకుండా సీక్వెల్ తీయనంటూ రీసెంట్లీ స్టేట్ మెంట్ పాస్ చేశాడు దర్శకుడు సెల్వరాఘవన్. ఈ లెక్కన కూడా ఇది కూడా కార్తీ ఖాతాలో చేరిపోయింది. ఈ సీక్వెల్ ప్రాజెక్టులే కాకుండా మారి సెల్వరాజ్ లాంటి తమిళ దర్శకులతోనూ సినిమాలు చేస్తున్నాడు. మొత్తానికి నెక్ట్స్ పోర్షన్ చిత్రాల్లోనూ హీరోగా మారి సీక్వెల్ కింగ్‌గా మారిపోయాడు కార్తీ.