నేచురల్‌స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్ 3. కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నేచురల్ స్టార్ నాని నిర్మించాడు. మే 1న రిలీజ్ అయిన హిట్ 3 హిట్ టాక్ అయితే రాబట్టింది. పబ్లిక్ హాలిడే రోజు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు రూ. 43 కోట్లతో నాని కెరీస్ లో బిగ్గెస్ట్ డే 1 ఓపెనింగ్ అందుకుంది.
Also Read : SSMB : ఈ నెల 30న భారీ ఎత్తున రీరిలీజ్ కానున్న ‘ఖలేజా’
అదే జోరు కొనసాగించి విడుదలైన నాలుగు రోజులకు గాను రూ. 101 కోట్లు రాబట్టింది హిట్ 3. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుందని అంచానా వేశారు. కానీ మొదటి సోమవారం ఈ సినిమా కాస్త డిప్ అయింది. ఇక వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ బాగా నెమ్మదించాయి. ముఖ్యంగా ఆంధ్ర ఏరియాలో పరిస్థితి కాస్త తేడా కొడుతోంది. ఒక్క ఉత్తరాంధ్ర మాత్రం రూ. 3.50 కోట్లకు రైట్స్ కొనుగోలు చేయగా 11 రోజులకు గాను రూ. 3.90 కోట్లు రాబట్టి లాభాల బాటలో పయనిస్తోంది. ఇక గుంటూరు రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేయగా ఇప్పటి వరకు రూ. 1.93 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ కోసం పోరాడుతుంది. ఈస్ట్, వెస్ట్, కృష్ణ, నెల్లూరులోను బ్రేక్ ఈవెన్ కు కాస్త దూరంలో ఆగింది హిట్ 3. తొలి రోజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కూడా బ్రేక్ ఈవెన్ కావడం లేదంటే ఆడియెన్స్ థియేటర్స్ కు ఆమడ దూరంలో ఉంటున్నారు అనే చెప్పాలి. థియేటర్ రన్ పూర్తయ్యేలోపు హిట్ 3 బ్రేక్ ఈవెన్ కు చేరుకొని ఒరిజినల్ గా హిట్ అవుతుందో లేదో చూడాలి.