మిల్కీ బ్యూటీ తమన్నాకు భారీ షాక్ తగిలింది. ఇటీవల తమన్నా బుల్లితెరపై ప్రసారమవుతున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో సందడి చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని ఎపిసోడ్స్ అయ్యాకా ఆమె ప్లేస్ లో అనుసూయను తీసుకొంటున్నట్లు మాస్టర్ చెఫ్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో తమన్నా మాస్టర్ చెఫ్ యాజమాన్యంకు లీగల్ నోటీసులు పంపింది. ఈ లీగల్ నోటీసులపై మాస్టర్ చెఫ్ యాజమాన్యం తాజాగా నోరు విప్పింది. ఒక ప్రకటన ద్వారా రూమర్స్ కి చెక్ పెట్టింది.
“మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ కి తమన్నాతో రూ. 2 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నాం.. జూన్ 24 నుంచి సెప్టెంబర్ చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు అగ్రిమెంట్ చేసుకోగా తమన్నా 16 రోజులు మాత్రమే షూటింగ్ కి అటెండ్ అయ్యింది. మిగతా రెండు రోజులు ఆమె రాకపోవడంతో 300 వందల మంది టెక్నీషియన్లు పనిచేస్తున్న షోకి రూ.5 కోట్లకు పైగా నష్టం వచ్చింది. ఇప్పటికే తమన్నా కు రూ. 1.56 కోట్లు చెల్లించేశాము. మిగతా బ్యాలెన్స్ రెండు రోజులు ఆమె షూటింగ్ రాకపోవడంతో చెల్లించలేదు. మేము చెప్పకుండా మా గురించి లేనిపోని రూమర్స్ రాయొద్దు” అంటూ తెలిపారు. రెండు రోజులు వెళ్లకుండా వారికి లీగల్ నోటీసులు ఎలా పెడతారు అంటూ తమన్నాపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రకటన విడుదల చేసి మాస్టర్ చెఫ్ నిర్వాహకులు మిల్కీ బ్యూటీ పరువు తీసినట్లే ఉందని పలువురు గుసగుసలాడుతున్నారు. మరి ఈ విషయంపై తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి.