టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విషయం మరోసారి తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న రానా, రకుల్ వంటి ఇతర ప్రముఖులకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేయడంతో మరోసారి ఇండస్ట్రీలో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయంపై మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసును ఇప్పటికీ అయిన త్వరగా తేలిస్తే మంచిదని అన్నారు.
Read Also : ‘మోసగాళ్ళకు మోసగాడు’మహేశ్ ఎందుకు చేయనన్నాడు!?
“నాకు తెలిసి సినీ పరిశ్రమలో డ్రగ్ పెడలర్స్ ఉండరు. యూజర్స్ ఉంటే ఉండవచ్చు. కొంత మంది డ్రగ్స్ తీసుకుంటున్నారేమో. తెలియదు కదా. కానీ డ్రగ్స్ వాడడం తప్పు. అయితే డ్రగ్స్ కేసు విచారణ అనేది పదేళ్ల నుంచి కామెడీ అయిపోయింది. తొందరగా విచారణ పూర్తి చేస్తే మంచిది. విచారణ జరిగినన్ని రోజులు ఆ 10 మంది ఇబ్బంది పడతారు. తర్వాత మాములే. విచారణ పూర్తి చేసి తప్పని తేలితే శిక్ష వేయాల, లేదంటే వదిలేయాలి. తొందరగా తేల్చకుండా ఉంటే విచారణ అన్నప్పుడల్లా వాళ్లకు ఫ్యామిలీలు ఉంటాయి. వాళ్ళు ఇబ్బందులు పడతారు” అంటూ చెప్పుకొచ్చారు. ఆయన మాత్రమే కాదు టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రజలు కూడా ఈ కేసును నీరుగార్చకుండా త్వరగా తేల్చాలని కోరుకుంటున్నారు.