‘రిచి గాడి పెళ్లి’ కోసం అనంత్ శ్రీరామ్ రాసిన ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా’ పాటకు థమన్ ప్రశంసలు దక్కాయి. కైలాష్ ఖేర్ పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు దర్శకనిర్మాతలు. ‘బాహుబలి, భరత్ అనే నేను, మున్నా, మిర్చి, పరుగు, అరుంధతి, గోపాల గోపాల, రాజన్న’ సినిమాలలో పలు హిట్ సాంగ్స్ పాడిన కైలాష్ ఖేర్ పాడిన ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మెచ్చుకున్నారని, సత్యన్ కంపోజ్ చేసిన ఈ పాట అనంత శ్రీరామ్ రాయటం, దానిని కైలాస్ గానం చేయటం అభినందించదగ్గ విషయమని థమన్ చెప్పటం ఆనందించ దగ్గ విషయమని దర్శకుడు కె.యస్. హేమరాజ్ అంటున్నాడు. ఇండోర్ గేమ్స్ ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇదని, ఆ చిన్న ఆటల వల్ల ఎందరి జీవితాల్లో, ప్రేమల్లో, స్నేహాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయన్నదే కథాంశమని గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చెబుతున్నారు. ‘రిచి గాడి పెళ్లి’ సినిమా మానవ సంబంధాలకు అద్దం పట్టేలా ఉంటుందనే నమ్మకాన్ని నిర్మాతలు రామ్ మహేంద్ర, శ్రీ, సూర్య వ్యక్తం చేస్తున్నారు. నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, సత్య, కిశోర్, ప్రవీణ్ రెడ్డి, బన్నీ వోక్స్, చందన రాజ్ ఈ సినిమాలోని ప్రధాన తారాగణం.