విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు లోకేష్ కనగరాజ్. కమల్, కార్తీ, సూర్య, ఫాహాద్, సేతుపతిలని ఒక సినిమాలోకి తెచ్చి ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశాడు లోకేష్. ఇండియాలోనే హైయెస్ట్ డిమాండ్ ఉన్న ఈ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి దళపతి విజయ్ చేరుతున్నాడు అనే వార్తాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం లోకేష్, దళపతి విజయ్ తో సినిమా మొదలుపెట్టడమే. మాస్టర్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ లోకేష్ కనగరాజ్ విజయ్ తో సినిమా చేస్తున్నాడు. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతుంది. కాశ్మీర్ షెడ్యూల్ కూడా అయిపోకుండానే దళపతి 67 సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేసి నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యారు. ఇందులో దళపతి 67 సినిమాకి లియో అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఇప్పుడు లియో షూటింగ్ స్పాట్ నుంచి క్యాంప్ ఫైర్ ని పెట్టుకోని కాస్ట్ అండ్ క్రూ ఎంజాయ్ చేస్తున్న మరో ఫోటోని రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఈ ఫోటోలో విజయ్, లోకేష్ తో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ ఫోటో ట్రెండ్ అవుతుంది. 2020 ఫిబ్రవరి 10న మాస్టర్ సినిమా సెట్స్ నుంచి విజయ్ ఒక ఫోటో పోస్ట్ చేశాడు. సరిగ్గా మూడేళ్ల తర్వాత మళ్లీ విజయ్-లోకేష్ తో కలిసి సినిమా చేస్తూ అదే ఫిబ్రవరి 10న ఫోటో బయటకి వదిలారు. ఇదిలా ఉంటే విజయ్ తో లోకేష్ చేస్తున్న లియో మూవీ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఉంటుందా? లేక ఇది కూడా మాస్టర్ తరహలో స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుందా అనేది చూడాలి.