మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా TFIలోకి ఎంట్రీ ఇచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా రిలీజ్ కి ముందే మంచి బజ్ ని జనరేట్ చేసింది ఉప్పెన సినిమా. విజయ్ సేతుపతి లాంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఉప్పెన సినిమాలో నెగటివ్ రోల్ ప్లే చేసాడు. హీరో, హీరోయిన్, దర్శకుడు ఇలా అందరూ కొత్త వాళ్లే, వీళ్ళు చేసిన సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానంతో థియేటర్స్ లోకి ఎంటర్ అయిన ఆడియన్స్ కి ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని చూపించారు. యూత్ మొత్తం ఉప్పెన సినిమా జపం చేసారు. అబ్బాయిలు తాను ప్రేమించిన అమ్మాయిని ‘బేబమ్మ’ అని పిలవడం మొదలుపెట్టారు. అంత ఇంపాక్ట్ చూపించిన ఉప్పెన సినిమాకి ప్రాణం పోసింది ‘క్లైమాక్స్’. తెలుగు ఆడియన్స్ అసలు యాక్సెప్ట్ చెయ్యరు అనుకునే విషయాన్ని బుచ్చిబాబు అందరూ కన్వీన్స్ అయ్యేలా చాలా మెచ్యూర్డ్ గా చెప్పాడు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలు పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని కట్టి పడేసారు. TFI హిస్టరీలో ఒక కొత్త హీరో సినిమా 70 కోట్లు రాబడుతుందని ఎవరూ ఊహించి ఉండరు, అలాంటి హిస్టరీ క్రియేట్ చేసిన ఉప్పెన సినిమా ఇప్పుడు తెలుగు నుంచి తమిళ్ లోకి వెళ్లబోతుంది.
కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కొడుకు సంజయ్ ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. 23 ఏళ్ల సంజయ్ ని హీరోగా చెయ్యాలని తమిళనాడులోని చాలా మంది దర్శక నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ వర్కౌట్ అవ్వట్లేదు. సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాడు ఈ కారణంగానే హీరోగా ఎవరు వచ్చి ఎన్ని కథలు చెప్పినా ఓకే చెయ్యట్లేదు. అయితే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌజ్ ఉప్పెన రీమేక్ రైట్స్ ని కొని, సంజయ్ ని కాకుండా విజయ్ ని అప్రోచ్ అయ్యి అటు నుంచి హీరోని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న మాట. ఈ ప్రాజెక్ట్ ఆన్ అయితే విజయ్ సేతుపతి, కృతి శెట్టి తమ పాత్రల్లో మార్పులు లేకుండా నటిస్తారని సమాచారం. అయితే బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో తమిళ ఉప్పెన సినిమాకి దర్శకత్వం వహిస్తాడా? లేక వేరే ఎవరి చేతికైనా ఉప్పెన రీమేక్ వెళ్తుందా అనేది చూడాలి. కథా, కథనంలోనే తమిళ ఆడియన్స్ కి సూట్ అయ్యే సెటప్ ఉంది కాబట్టి ఉప్పెన సినిమాని రీమేక్ చేస్తే సంజయ్ ని మంచి డెబ్యూ దొరికినట్లే.