Thalapathy67: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఇప్పటికే మాస్టర్ సినిమా వచ్చి రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత వీరి కాంబో ఎప్పుడెప్పుడు రీపీట్ అవుతుందా..? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. ఇక ఎట్టకేలకు ఆ కల నెరవేరింది.విక్రమ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న లోకేష్.. మరోసారి దళపతితో జట్టు కట్టాడు. దళపతి67 ను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సిల్వర్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. దాదాపు 14 ఏళ్ళ తరువాత విజయ్ సరసన త్రిష నటిస్తోంది. రెండు రోజుల క్రితమే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా కాశ్మీర్ లో షూటింగ్ కోసం బయలుదేరింది. మరోపక్క ఈ సినిమా టైటిల్ ను కొద్దిసేపటి క్రితమే మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ రివీల్ టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘లియో’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. బ్లడీ స్వీట్ అనేది ట్యాగ్ లైన్.
Aditi Rao Hydari: సిద్దూతో ఎఫైర్.. అదితి మొదటి భర్త అంత మాట అనేశాడేంటీ..?
ఇక ఈ టీజర్ లో విజయ్.. రెండు రకాలుగా కనిపించాడు. దాదాపు ఈ టీజర్ లో విజయ్ క్యారెక్టర్ ను రివీల్ చేశాడు లోకేష్.. ఒకపక్క చాక్లెట్ ను తయారు చేస్తూ.. ఇంకోపక్క కత్తిని కొలిమిలో రెడీ చేస్తూ విజయ్ కనిపించాడు.. మరోపక్క రౌడీలు కార్లలో బయలుదేరినట్లు చూపించారు. ఈ కత్తిని వారు వచ్చేలోపు రెడీ చేయడానికి విజయ్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో అలవోకగా.. ఒకపక్క చాక్లెట్ ను.. ఇంకోపక్క కత్తిని తయారుచేసే విధానాన్ని చాలా క్రియేటివ్ గా చూపించాడు లోకేష్.. ఇక చివర్లో మండే కత్తిని చాక్లెట్ సిరప్ లో ముంచి పైకి తీసి టేస్ట్ చేసి బ్లడీ స్వీట్ అని విజయ్ చెప్పడం అయితే ఫ్యాన్స్ కు పూనకాలే.. ఒక గ్యాంగ్ స్టర్ ప్రపంచానికి ఏమో చాక్లెట్స్ తయారుచేసే చెఫ్ లా కనిపిస్తూ.. తన గ్యాంగ్ ను ఎదిరించడానికి వచ్చేవారికి నరకం చూపిస్తూ ఉంటాడని ఈ టీజర్ ను బట్టి తెలుస్తోంది. మరి ఈ చాక్లెట్ గ్యాంగ్ స్టర్ కథ ఏంటి అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా అక్టోబర్ 19 న అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈ మాస్టర్ కాంబో మరోసారి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
— Vijay (@actorvijay) February 3, 2023