Aditi Rao Hydari: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సిద్దు.. హీరోయిన్ అదితి రావు హైదరి తో డేటింగ్ చేస్తున్నాడు. ముంబై మొత్తం ఈ జంట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ మధ్యనే శర్వానంద్ ఎంగేజ్ మెంట్ కు జంటగా కూడా వచ్చి అందరికి షాక్ ఇచ్చారు. ఒకరి మీద ఒకరు ప్రేమ ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చినా.. పెళ్లి విషయం గురించి మాత్రం ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఈ జంట పెళ్లి చేసుకుంటారా..? లేదా..? ఇలానే సహజీవనం చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే సిద్దుకు- అదితికి అంతకుముందే వివాహాలు అయ్యి విడాకులు తీసుకొని విడిపోయినట్లు అందరికి తెల్సిందే. అదితి భర్త సత్యదేవ్ మిశ్రా గతేడాది రెండో వివాహం కూడా చేసుకున్నాడు. అది కూడా ఎవరినో కాదు.. బాలీవుడ్ నటి నీనా గుప్తా కుమార్తె మసాబా గుప్తాను. వారిద్దరి పెళ్లి ఎంతో సింపుల్ గా జరిగింది. పెళ్లి తరువాత మొదటిసారి ఒకఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సత్యదేవ్ మిశ్రా.. మొదటి భార్య అదితి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Prema Desam Movie Review: ప్రేమదేశం
“అదితితో రిలేషన్ లో ఉన్నన్నీ రోజులు నరకాన్ని అనుభవించాను. ఆమెతో రిలేషన్ వలన నాకు ప్రేమ మీదనే విరక్తి కలిగింది. మరొకరితో ప్రేమ, పెళ్లి అనే ఆలోచన కూడా రాలేదు. మరోసారి ఎక్కడ నేను అదే నరకాన్ని అనుభవిస్తానో అని అనిపించింది. అందుకే ఇన్నేళ్లు పెళ్ళికి దూరంగా ఉన్నాను. నేనే కాదు .. బ్రేకప్ అయిన తరువాత ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. కానీ, దాన్ని నుంచి బయటపడి ఒక స్టెప్ ముందుకు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం. అలా మసాబా నా జీవితంలోకి అడుగుపెట్టింది. చాలా తక్కువమంది బంధుమిత్రుల మధ్య మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోని పెద్దలను పిలిచి పార్టీ ఇచ్చాం. ఎందుకంటే మా బంధాన్ని మేము రహస్యంగా ఉంచాలనుకోలేదు. ఆ అవసరం కూడా మాకు లేదు. సీక్రెట్స్ అనేవి బంధాన్ని విడతీయడానికి చూస్తూ ఉంటాయి. బంధంలో నిజాయితీ ఉంటే అది ఎప్పటికి మన సొంతంగా ఉంటుంది.. దాన్ని నేను నమ్ముతాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అదితికి మొదటి భర్త స్ట్రాంగ్ కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది. సిద్దార్థ్ తో సీక్రెట్ రిలేషన్ గురించే అతడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై సిద్దు- అదితి ఎలా స్పందిస్తారో చూడాలి.